Stray dogs chased a bear in Adilabad of Telangana ఎలుగుబంటిని పరిగెత్తించిన వీధి కుక్కలు..

Bear chased away by stray dogs in adilabad of telangana

bear chased away by dogs, bear chased away by stray dogs, bear appeared in the fields, adilabad forest area, dogs chased away bear, bear video goes viral on social media, bear, stray dogs, Farmers, villagers, Antargaon suburban area, Bhimpur zone, Adilabad district, Telangana, viral video

Adilabad district Bhimpur zone Antargaon suburban bear wandering has caused a stir. In this sequence the bear suddenly appeared in the fields from the forest area surrounding the crop. All the villagers together went with the dogs to the area where the bear roamed. There the free-roaming bear was chased away with the help of dogs. Many of those who videotaped these scenes went viral after being posted on social media.

ITEMVIDEOS: వామ్మో.. ఎలుగుబంటి.. పరుగులు తీసిన రైతులు.. తరిమిన వీధి కుక్కలు..

Posted: 06/16/2022 08:50 PM IST
Bear chased away by stray dogs in adilabad of telangana

ఒక్కసారి మనకే ఎవరిపైనైనా కోపం వచ్చిందంటే చాలు.. వారిని ఏమీ చేయలేక.. మనం ఏం చేసినా.. గమ్మున ఇళ్ల ముందే పడుండే వీధి కుక్కలపై ఆ కోపాన్ని ప్రదర్శిస్తాం. అయితే అవి.. మనం పెట్టే కొంచం అన్నం తిని ఎంత విశ్వాసంగా ఉంటాయో ఇప్పటికే అనేక వీడియోల ద్వారా మనం చూశాం. ఒక సందర్భంగా పులులను కూడా ఎదురించిన శునకాలు.. యజమానుల కోసం తమ ప్రాణాలను సైతం ఇట్టే త్యాగం చేస్తాయి. అయినా చివరి వరకు యజమాని క్షేమం కోసమే తలపిస్తాయి తప్ప.. తమ ప్రాణం అంటూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవు.

ఇలాంటి విశ్వాసం మరే జంతువులోనూ కనిపించదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని అటవీప్రాంతానికి సమీపంలో వున్న ఓ ప్రాంతంలోకి అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి వచ్చింది. దీంతో వర్షాలు పడటంతో పోలం పనులపై ఉదయాన్నే చేన్లకు వెళ్లిన రైతులు ఎలుగుబంటిని చూసి గ్రామంలోకి పరుగులు తీశారు. అయితే వారికి అండగా అదే ప్రాంతానికి వచ్చిన వీధి కుక్కలు మాత్రం.. ఎలుగుబంటిని తమ గ్రాప పోలిమేరలు దాటేవరకు తరిమేశాయి. ఔనా.. అని అంటున్నారా.. ఇది ముమ్మాటికీ నిజం. అదిలాబాద్ జిల్లా  భీంపూర్ మండలం అంతర్గావ్ శివారులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది.

వానాకాలం పంట వేయడానికి తెల్లవారుజామునే రైతులు, కూలీలు పొలాలకు చేరారు. ఈ క్రమంలో పంటచేల పరిసరాల్లో ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా పొలాల్లో ప్రత్యక్షమైంది. ఎలుగును చూసి రైతులు, కూలీలు పరుగులంకించారు. గ్రామంలోకి పరుగు తీసి గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులంతా కలిసి ఎలుగుబంటి సంచరించే ప్రాంతానికి శునకాలతో వెళ్లారు. అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్న ఎలుగుబంటిని శునకాల సాయంతో తరిమికొట్టారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఎలుగుబంటి నుంచి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles