Indian Army personnel rescue 4 people stuck in Sindh River సింధు నదిలో చిక్కకున్న పర్యాటకులు.. ఆర్మీ ఆపన్నహస్తం

Indian army personnel rescue 4 people stuck in sindh river in jammu and kashmir s sonamarg

Indian Army rescue four people, Sind river, four rescued from Sind river, Sonmarg, Indian Army, Sind River, Sindh River, Baltal, Sonamarg, Srinagar, Four Tourists, Amarnath Yatra, Jammu and Kashmir, Crime

The Indian Army is not only known for its bravery, but also for helping civil authorities in carrying out rescue missions when needed. On Sunday, Army personnel rescued four people after their vehicle got stuck in the Sindh river near the Baltal area in Jammu and Kashmir.

ITEMVIDEOS: సింధు నదిలో చిక్కకున్న పర్యాటకులు.. ఆపన్నహస్తం అందించిన ఆర్మీ

Posted: 06/13/2022 07:13 PM IST
Indian army personnel rescue 4 people stuck in sindh river in jammu and kashmir s sonamarg

ఇండియ‌న్ ఆర్మీ.. ఎండా, వాన.. పగలు, చీకటి.. ఎడారులు, పర్వతాలు, హిమపాతాల్లోనూ అనునిత్యం గస్తీ కాస్తూ.. దేశంలోకి ఎవరూ చోరబడకుండా పహారా కాస్తుంటారు. వారికి ఎల్లవేళలా ప్రేరణ కల్పించేది జాతీయ జెండా.. దేశమా.? ప్రాణమా.?అంటే.. ప్రాణం తీయడానికే కాదు.. ఇవ్వడానికైనా వెనుకాడనివాడే సైనికుడు. జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాధపీ కరీయసి అంటూ భరతమాత నిత్యం శాంతియుతంగా ఉండాలని దేశసేవకై సైన్యంలో చేరి.. కన్నవారికి, కట్టుకున్నవారికి దూరంగా ఉంటూనే వారితో ఎనలేక ప్రేమబాంధవ్యాలను కొనసాగించేవాడే సైనికుడు.

శత్రువుల‌కు ఎదురు నిలిచి ధైర్యసాహసాలు ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కాదు.. అవ‌స‌ర‌మైన‌పుడు రెస్క్యూ ఆపరేషన్​లు నిర్వహించి పౌరుల‌ను కాపాడేవాడే సైనికుడు. ఆర్తనాథం వినిపించిన వెంటనే అభయహస్తాన్ని అందించి.. నేనున్నానంటూ అదుకునేవాడే సైనికుడు. ఇంతలా సైనికుల గురించి చెబుతన్నారేంటీ అంటే.. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా బతకగలుతున్నారంటే అందుకు సైనికులే కారణం. ఇక తాజాగా భారత సైన్యం రంగంలోకి దిగి నలుగురు దేశపౌరుల ప్రాణాలను కాపాడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని సింధ్ నది సమీపంలో విహారయాత్ర కోసం బల్తాల్ ప్రాంతానికి నలుగురు యాత్రికులు వెళ్లారు.

వారు తమ వాహనంతో సింధ్​ న‌దిని దాటాల‌ని అనుకున్నారు. ఈ క్రమంలో నదిలో చిక్కుకున్నారు. దీంతో వారు అటు ఒడ్డుకు వెళ్ల‌లేక‌, వెన‌క్కిపోలేక తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకొని అందులోనే ఉండిపోయారు. అయితే ఇదే స‌మ‌యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం బాల్టాల్-డోమెల్ వద్ద మొహరించిన ఇండియ‌న్ ఆర్మీ పెట్రోలింగ్ బృందం నదిలో చిక్కుకున్న వాహ‌నాన్ని గ‌మ‌నించింది. దీంతో వెంట‌నే రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల‌ను తీసుకొని ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుంది. జేసీబీని ఉప‌యోగించి, వ‌ల సహాయంతో ఆ న‌లుగురు పౌరుల‌ను రక్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్​ అవుతుంది. సైనికులపై ప్రశంసల జల్లు కురుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Army  Sind River  Sindh River  Baltal  Sonamarg  Srinagar  Four Tourists  Amarnath Yatra  Jammu and Kashmir  Crime  

Other Articles