కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్కు భారీ షాక్ తగిలింది. కాషాయ పార్టీకి చెందిన ఎంపీ.. సొంత పార్టీ బీజేపీపైనే సంచలన విమర్శలు చేశారు. హస్తినలో రైతు ఉద్యమం జోరందుకున్న తరుణంలోనూ ఆయన ఇదే శైలిని కొనసాగించి.. అధిష్టానాన్ని ధిక్కరించే స్వరాన్ని ఎత్తారు. రైతులకు కనీస మద్దతు ధర కాకుండా.. గరిష్ట ధర ఎంత ఇస్తారన్నది చట్టబద్దం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ల తీరును కూడా పరిశీలించి.. అన్యాయాలు, అక్రమాలపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు అదేశించిన కూడా ఆ పార్లమెంట్ సభ్యుడే.
తాజాగా నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని మరోమారు టార్గెట్ చేశారు. ఆయన మరోవరో కాదు ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. దేశంలోని నిరుద్యోగ సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని నిరుద్యోగాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం పెంచిపోషిస్తుందని విమర్శలు చేసిన ఆయన.. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని నిరుద్యోగం గత మూడు దశాబ్దాల కంటే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నదని కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు.
భారత్లో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉందంటూ.. ప్రస్తుతం ఇదే దేశంలో బర్నింగ్ ప్రాబ్లమ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం అయ్యాయి. అంతేకాదు.. దేశవ్యాప్ంగా వరున్ గాంధీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విద్యావంతులుగా అయ్యేందుకు ప్రస్తుతం యువత పోటీపడుతున్నారని, అయితే ఉపాధి అవకాశాలు మాత్రం మృగ్యమయ్యాయన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగితేనే దేశం శక్తివంతం అవుతుందని కుండబద్దలుకొట్టారు. ఒక వైపు ఉద్యోగాలు లేక దేశంలోని కోట్ల మంది యువత నిరుత్సాహంలో మునిగి ఉన్నారని అన్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 60 లక్షలకుపైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇదిలా ఉండగా.. కేంద్ర గణాంకాలను నమ్మవచ్చా? పలు శాఖల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్ ఎక్కడకు వెళ్లింది? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న నిరుద్యోగులందరీ ఈ విషయం తెలుసుకునే హక్కు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కొద్దిరోజుల కిత్రం పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలను వెల్లడించారు. ఈ సందర్బంలో తాను చదవి వినిపించిన డేటా తనది కాదని.. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీదని తెలిపారు. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి తన డేటాను చదవి వినిపించిన అసదుద్దీన్ ఒవైసీకి వరణ్ గాంధీ కృతజ్ఞతలు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 17 | స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ.. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగానికి ఆ మరుసటి రోజున.. బీజేపి పాలిత రాష్ట్రంలోనే తూట్లు పోడిచారు. ప్రధాని మోడీ సోంత రాష్ట్రం... Read more
Aug 17 | జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు... Read more
Aug 17 | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని... Read more
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more