Govt lists few medicine to be sold OTC ఇకపై ఈ మందులకు డాక్టర్ చీటి అవసరం లేదు.!

Govt lists few medicine to be sold otc overdose can trigger severe allergies

Medicine, Union Health Ministry, government, Drug use, drug abuse, over the counter drugs, Gazette of India, pharmacies, Doctor, Prescription

According to a draft notification published in the Gazette of India, the government plans to allow 16 commonly-used medicines such as paracetamol to be sold over the counter (OTC) by modifying the law. The OTC sale means that a medicine can be bought from the retail market (pharmacies) without a doctor's prescription.

ఇకపై ఈ మందులను ఓటిసీలో కొనచ్చు.. డాక్టర్ చీటి అవసరం లేదు.!

Posted: 06/07/2022 05:55 PM IST
Govt lists few medicine to be sold otc overdose can trigger severe allergies

దేశంలో ఎవరైనా సరే అస్వస్థత పాలైతేవారు అందుకు సంబంధించిన అలోపతి మందులనే తొలుత వాడుతారు. జ్వరం వచ్చిందనుకోండి.. వెనుకాముందు ఆలోచించకుండా వెంటనే ఓ పారాసిటమాల్ మాత్ర మింగేస్తాం. జలుబు చేసిందంటే చాలు వైద్యుడి దగ్గరకు వెళ్లకుండానే మందులు వాడేస్తుంటాం. తలనొప్పి వచ్చినా, కడుపునొప్పి వచ్చినా.. ఇంకేదైనా చిన్న సమస్య కనిపించినా డాక్టర్ అవసరం లేకుండా మాత్రలు తెచ్చేసుకుని వాటిని వాడేస్తుంటాం. అప్పటికీ తగ్గకపోతే.. అప్పుడు వైద్యులను సంప్రదించి.. వేసుకున్న మాత్రల పేర్లను చకచకా చెప్పేయడం దేశంలోని చాలామందికి అలావాటు.

ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయంటే.. రోగాలకు మాత్రలను తెచ్చుకోవడం లేదా.. వాటి గురించి ఫార్మసిస్టును అడగటం.. వారి సూచనల మేరకు మాత్రలను తీసుకోవడం చాలమందికి అలవాటుగా మారింది. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే.. ఈ చిన్నా చితక రోగాలకు కూడా వైద్యులను సంప్రదిస్తే.. వారికి వందల్లో ఫీజులు చెల్లించాల్సి రావడం కూడా ఒక కారణం. అయితే ఫీజలు తీసుకోకుండా మాత్రలను రాసి ఇచ్చే వైద్యులు వున్నా.. సమయం ఎందుకు వేస్ట్ చేయడం అని భావిస్తారు కొంత మంది. ఎందుకంటే ఈ అస్వస్థత తరచుగా రావడం.. అందుకు వైద్యులు ఇచ్చే మాత్రల గురించి వారికి తెలియడంతో ఈ చాలా మంది ఇలా చేస్తున్నారు.

ఇలా దేశంలో చాలా మంది ప్రజలు అనుసరించే ఈ పద్దతిని తెలుసుకున్న కేంద్రం.. ఒక కీలక సవరణను కూడా చేయనుంది. అదేంటంటే.. సాధారణ వ్యాధులకు వాడే జ్వరం మాత్రలు, కీళ్ల నోప్పులకు వాడే క్రీములు సహా పలు మాత్రలు, ఔషదాలకు ఇప్పటిదాకా ప్రిస్క్రిప్షన్ (డాక్టర్ చీటీ) తప్పనిసరిగా ఉండేది. ఇకపై ఆ రూల్ ను ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. డాక్టర్ చీటీ లేకుండానే కామన్ గా వాడే 16 రకాల ఔషధాలను కౌంటర్ లో అమ్ముకునే మందుల కేటగిరీ (ఓవర్ ద కౌంటర్)లోకి వాటిని మార్చాలని యోచిస్తోంది. అందుకు ఇప్పుడున్న ఔషధ నియంత్రణ చట్టం 1945లో సవరణలు చేయాలని కసరత్తులు చేస్తోంది.

గెజిట్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయిన ముసాయిదా నోటిఫికేషన్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. జ్వరం ఔషధాలతో పాటు జలుబు, ముక్కుదిబ్బడ, మలవిసర్జన సాఫీగా జరిగేందుకు తోడ్పడే మందులు (లాగ్జేటివ్స్), నోటిని శుభ్రం చేసే ఔషధ ద్రావణాలు, మొటిమలను పోగొట్టే క్రీములు, నొప్పి తదితర ఔషధాలను ఓటీసీ ప్రొడక్టులుగా మార్చనుంది. అయితే, ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే మందులను ఐదు రోజులకు మించి వాడకూడదని, ఆ మందులను వాడినా ఫలితం లేకుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలనే నిబంధనను జోడించనుంది. ప్రజల ఫీడ్ బ్యాక్ కోసం ముసాయిదా నోటిఫికేషన్ ను కేంద్రం అందరికీ అందుబాటులో ఉంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles