Tumour vanishes post immunotherapy treatment క్యాన్సర్ కణాలు మాయంచేసిన దివ్యౌషధం.. ట్రయల్స్ సక్సెస్!

Clinical trial on 18 patients suffering from rectal cancer yields results

rectum cancer, clinical trial, dostarlimab, Jemperli, immunotherapy drug, US Clinical Trail, world's first sucess trail, cancer tumors, endometrial cancer, clinical investigation, cancer disappeared, cancer drug intervention, oncologist Luis Diaz Jr, Memorial Sloan Kettering Cancer Center, United states

In a small clinical trial in the US, 18 patients took a drug for close to six months, which resulted in the disappearance of their tumours. A small group of people with rectal cancer just experienced something of a miracle as their cancer simply vanished after experimental treatment. The medication given, called dostarlimab and sold under the brand name Jemperli.

క్యాన్సర్ కణాలు మాయం.. ఇది ఔషధం మహత్యం... ట్రయల్స్ లో అద్భుతం!

Posted: 06/07/2022 06:51 PM IST
Clinical trial on 18 patients suffering from rectal cancer yields results

మానవుడి పాలిట ప్రాణాంతక రుగ్మతల్లో క్యాన్సర్ కూడా ఒకటి. దేహంలో ఏ అవయవాన్నయినా నాశనం చేసి మనిషి మరణానికి దారితీసే క్యాన్సర్ ను ఓ దశ వరకు మాత్రమే నయం చేసే వీలుంటుంది. అయితే, న్యూయార్క్ లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు తాజా నిర్వహించిన డ్రగ్ ట్రయల్స్ క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. పురీష నాళ క్యాన్సర్ తో బాధపడుతున్న 18 మందిపై స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు డోస్టార్లిమాబ్ అనే ఔషధాన్ని ప్రయోగించారు. వారికి ఆర్నెల్ల పాటు ఈ ఔషధాన్ని ఇచ్చారు.

ట్రయల్స్ ముగిసేసరికి ఆశ్చర్యకరంగా, ఆ 18 మంది రోగుల్లో క్యాన్సర్ కణజాలం అదృశ్యమైంది. ఆ రోగులు గతంలో క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ, రేడియేషన్, శస్త్ర చికిత్సలతో తీవ్ర శారీరక వేదన అనుభవించారు. వారిలో కొందరికి తీవ్రస్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. ఇలాంటివారందరి పైనా డోస్టార్లిమాబ్ ఔషధం ప్రయోగించగా, ఆర్నెల్ల తర్వాత వారిలో ఏ ఒక్కరిలోనూ క్యాన్సర్ కనిపించలేదు. తదుపరి చికిత్సలు అవసరంలేని రీతిలో వారంతా సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకున్నారు. డోస్టార్లిమాబ్ ఔషధంలో ల్యాబ్ లో రూపొందించిన అణువులు ఉంటాయి.

ఇవి మానవదేహంలోకి ప్రవేశించాక యాంటీబాడీలకు నకళ్లుగా పనిచేస్తూ క్యాన్సర్ కణాల పనిబడతాయి. ఈ ఔషధం వాడిన తర్వాత ఆ 18 మంది రోగులకు ఎండోస్కోపీ, పీఈటీ స్కానింగులు, ఎమ్మారై స్కానింగులు నిర్వహించారు. అన్ని పరీక్షల్లోనూ క్యాన్సర్ లేదనే ఫలితాలు రావడంతో పరిశోధకులు సంతోషంతో పొంగిపోయారు. నిజంగా ఇది క్యాన్సర్ చరిత్రలో అద్భుత పరిణామం అని ఈ ట్రయల్స్ లో పాలుపంచుకున్న డాక్టర్ లూయిస్ ఏ డియాజ్ వెల్లడించారు. ఓ ఔషధంతో క్యాన్సర్ మటుమాయం కావడం ఇదే తొలిసారి అని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles