హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు. కాగా, తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారైంది. ఈ శిక్షతో పాటు ఆయనకు రూ.50 లక్షల జరిమానాను విధిస్తూ ఢిల్లీ కోర్టు శుక్రవారం మధ్యాహ్నం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలని కోర్టు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.
హర్యానాలో అర్హత లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించారన్న కేసులో ఇప్పటికే దోషిగా తేలి పదేళ్ల పాటు జైలు జీవితం గడిపి ఏడాది క్రితమే చౌతాలా విడుదలయ్యారు. ఈ క్రమంలో ఇంతకుముందే ఆయనపై దాఖలైన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసులోనూ విచారణ వేగం పుంజుకుంది. ఈ క్రమంలో గత వారమే విచారణను ముగించిన కోర్టు... చౌతాలాను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఈ కేసులో చౌతాలాకు శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more