Russian pilot films mid-air sex tape with trainee గాల్లో విమానం.. ట్రైనీ పైలట్ తో పైలట్ శృంగారం..

Russian pilot films mid air sex tape with trainee gets fired as video goes viral

Russian pilot, Trainee pilot, sex tape, mid-air pilot and trainee sex, Sasovo Flight School of Civil Aviation, autopilot mode, filming sex act, Russia, crime, sex tape, sex tape allegation, pilot has sex midair, pilot sex tape, trainee pilot sex tape, sex tape row, priest turns porn star, Trending News, Russian pilot,Beirut hospital,female cadet,fighter jet flew,Southern Asia,sex tape,military school,Homs,Northern America,Asia,Sasovo Flight School Of Civil Aviation

A Russian pilot has allegedly been fired after making a sex tape with a woman trainee in a cockpit. The bizarre incident reportedly took place at the Sasovo Flight School of Civil Aviation in Russia as the flight instructor and the student switched the plane into autopilot in order to film their act.

గాల్లో విమానం.. ట్రైనీ పైలట్ తో పైలట్ శృంగారం.. భాగోతం తెలిసి టర్మినేట్

Posted: 05/27/2022 04:33 PM IST
Russian pilot films mid air sex tape with trainee gets fired as video goes viral

ట్రైనీ పైలట్‌కు ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని చెప్పి ఆశ చూపిన ఓ శిక్షణ పైలట్.. అమెను మెల్లిగా ముగ్గులోకి దింపాడు. వద్దు వద్దు అనుకుంటూనే అమె కూడా పైలట్ కు అనుకూలంగా మసలుకుంది. దీంతో విమానం గాల్లో ఉండగానే వీరిద్దరూ రాసలీల్లో మునిగితేలారు. ఇది ఇద్దరి మధ్యే ఉండాల్సిన రహస్యం. కానీ తన స్నేహితురాలితో అయిన గొడవ కాస్తా దీనిని బహిరంగపర్చింది. అయితే అప్పటి వరకు తాము కేవలం ముద్దులు, ముచ్చట్లు, కౌగిలింతవరకే పరిమితం అయ్యామని చెప్పిన మహిళా ట్రైనీ పైలట్.. వీడియో వెలుగుచూడటంతో మాట మార్చింది. అయితే గాలిలో విమానం ఉండగా ఇదెలా సాధ్యమయ్యిందీ.? అన్న వివరాల్లోకి వెళ్తే..

విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయిన పైలట్, ట్రైనీ పైటట్ వీర లెవల్లో శృంగారంలో మునిగితేలాడు. రష్యాలో జరిగిందీ ఘటన. 21 ఏళ్ల ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇస్తున్న పైలట్ (28) తన కోరిక తీరిస్తే మరిన్ని ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని ఆశ చూపాడు. తొలుత ఆమె నిరాకరించినా ఆ తర్వాత అతడికి లొంగిపోయింది. దీంతో విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో పెట్టాడు. ఆపై ఇద్దరూ రాసలీలలకు దిగారు. అంతేకాదు, మొబైల్‌లో తమ శృంగారం మొత్తాన్ని రికార్డు కూడా చేసుకున్నారు.

ఈ విషయం బయటకు రాకుండా రహస్యంగా ఉండిపోయేదే. అయితే, ఆ ట్రైనీ పైలట్ తన తోటి కేడెట్‌తో గొడవపడింది. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ఈ వీడియోను బయటపెట్టేసింది. దీంతో విషయం కాస్తా బయటకు వచ్చేసింది. వెంటనే అప్రమత్తమైన ఫ్లైయింగ్ స్కూల్ పైలట్‌ను, ట్రైనీ పైలట్‌ను బహిష్కరించింది. ఇదే విషయమై తొలుత ఆ ట్రైనీ పైలట్ మాట్లాడుతూ.. తాము ముద్దులు, కౌగిలింతలకే పరిమితమయ్యామని చెప్పింది. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత మాట మారుస్తూ ‘అలా’ ఒకసారే జరిగిందని చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles