తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అలాగే, ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా జై ఎన్టీఆర్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
కాగా, ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్.. సదా మీ సేవలో.. అంటూ ఎన్టీఆర్ ఫొటోతో ట్వీట్ చేశారు. అంతేకాదు ఎంతో భావోద్వేగంతో కూడిన ఓ ట్వీట్ కూడా షేర్ చేశారు. తన తాత నందమూరి ఎన్టీ రామారావును తలచుకుంటూ.. తన మాదిరిగానే ఈ తెలుగుజాతి, తెలుగు నేల తలచుకుంటోందని, అందుకోసం పెద్దమనసుతో మళ్లీ ఒక్కసారి తాకిపోవా అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ‘‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా..’’ అని రాసుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more