Video of girl hopping to school on one leg goes viral దివ్యాంగ విద్యార్థిని దీనస్థితిపై స్పందించిన సోనూసూద్‌

Bihar girl lost one leg while walking to school sonu sood extends help

Sonu Sood, philanthropist, actor, Seema, Bihar Girl, unfortunate accident, Specially abled girl, girl in school uniform, Kilometre with one leg, School, Education news, nas report, education ministry, determined girl, twitter, viral video, Jamui district, Bihar, Politics

Actor Sonu Sood has extended his support to a Bihar girl who walks on a single leg for almost a kilometre to reach her school. He shared the story of the girl on social media platform, Twitter, and promised to help her so that she can walk on both of her legs.

ITEMVIDEOS: ఒంటికాలిపై స్కూల్‌కు.. దివ్యాంగ విద్యార్థిని దీనస్థితిపై స్పందించిన సోనూసూద్‌

Posted: 05/26/2022 09:36 PM IST
Bihar girl lost one leg while walking to school sonu sood extends help

స్కూలు యూనిఫాంలో ఓ దివ్యాంగ‌ విద్యార్థిని ఒంటికాలిపై పాఠశాలకు వెళ్లే వీడియో ఇంట‌ర్నెట్‌లో విపరీతంగా వైర‌ల్ అయ్యింది. అందరూ చేసేవాళ్లే కానీ.. ఆ బాలికకు కావాల్సిన అదుకునే హస్తం మాత్రం రాలేదు. కాగా, ఈ వీడియో తెగ వైరల్ కావడంతో.. అమెకు ఏకంగా తీయటి కబురు అందింది. అదుకునే ఆపన్న హస్తం స్పందించి.. ఆ బాలికతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా టికెట్ పంపించి ఇక త్వరగా ప్రయాణం చేయాల్సిందిగా చెప్పింది. ఇంతకీ ఆ ఆపన్నహస్తం అందించింది ఎవరు అంటే.. వలస కార్మికుల దీనస్థితిని చూసి పట్టెడన్నం పెట్టడంతో పాటు బస్సులు వేసి వారిని వారివారి స్వగ్రామాలకు తరలించడంతో దేశవ్యాప్త ప్రజలకు సుపరిచితుడైన నటుడు సోనూ సూద్.

బీహార్ రాష్ట్రంలోని జాముయ్ జిల్లాకు చెందిన సీమా అనే విద్యార్థిని ఓ ప్రమాదంలో తన కాలిని కోల్పోవాల్సి వచ్చింది. అయితే అప్పటి నుంచి అమె కొన్న రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయింది. ఆ తరువాత తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలకు వెళ్తానంది. దీంతో వారు సరేనన్నారు. అయితే ఒంటికాలితో ఎలా అని మదనపడ్డారు. ప్రారంభంలో వారు తోడుగా వెళ్లారు. అయితే రాను రాను అలవాటు చేసుకన్న బాలిక.. ప్ర‌తిరోజూ కిలోమీట‌ర్ దూరంలో ఉన్న పాఠ‌శాల‌కు అలాగే ఒంటికాలిపై గెంతుకుంటూ వెళ్తోంది. ఈ వీడియో ప్ర‌ముఖ న‌టుడు, స‌మాజ‌ సేవ‌కుడు సోనూసూద్ కంట‌ప‌డింది. త్వ‌ర‌లోనే ఆమెకు స‌హాయం చేయ‌నున్న‌ట్లు సోనూసూద్ ప్ర‌క‌టించాడు.

ఓ రోడ్డుప్ర‌మాదంలో ఆ విద్యార్థిని కాలు కోల్పోయింద‌ని స్థానిక మీడియా పేర్కొంది. అయినా, చదువుకోవాల‌ని ఆమె త‌ప‌న‌ముందు వైక‌ల్యం ఓడిపోయింది. ఒంటికాలిపై గెంతుతూ త‌న ల‌క్ష్యాన్ని సాధించేందుకు స్కూల్ బాట‌ప‌ట్టింది. ఆ విద్యార్థినికి చ‌దువుపై ఉన్న శ్ర‌ద్ధ సోనూసూద్‌ను క‌ట్టిప‌డేసింది. ‘ఇక నువ్వు స్కూల్‌కు ఒక కాలిపై గెంతుకుంటూ వెళ్ల‌వు. టికెట్స్ పంపిస్తున్నా వ‌చ్చేయ్‌.. నువ్వు రెండు కాళ్ల‌పై చెంగుచెంగున స్కూల్‌కు వెళ్లాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది.’ అని ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి సోనూసూద్‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles