Man with no Paytm account loses through Same పేటీఎం లేదు.. కానీ ఆ పేరుతో సైబర్ నేరగాళ్ల లూటీ ఆగలేదు..!

Kerala man with no paytm account loses rs 20 000 through paytm

Malappuram man loses money online, Cybercrime in Malappuram, Man loses money through Paytm, Malappuram paytm fraud case, Anees Rahman, Malappuram, no Paytm account, Rs.20,000, bank account, Paytm withdrawal, Wandoor, Vaniyambalam, Cyber Crime, Kerala Police, Kerala latest news, Kerala paytm fraud case, Malappuram online fraud news, Malappuram crime news

A man named Anees Rahman from Malappuram, who has no Paytm account, has lost Rs.20,000 from his bank account through Paytm withdrawal. He is a native of Wandoor in Vaniyambalam and has lodged a complaint to the Cyber police regarding this matter.

పేటీఎం లేదు.. కానీ ఆ పేరుతో సైబర్ నేరగాళ్ల లూటీ ఆగలేదు..!

Posted: 05/26/2022 09:34 PM IST
Kerala man with no paytm account loses rs 20 000 through paytm

ఈజీ మనీవేటలో సైబర్ నేరగాళ్లు వేసే కొత్త ఎత్తులు.. ఔరా అనిపించేలా ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయినా వీళ్లు దొంగలే. దొంగలు రహస్యంగా రెక్కీ నిర్వహించి ఇంటికి కన్నాలు వేయడం, జేజులు కొట్టేయడం, మోసలు చేయడం లాంటి గారడీ విద్యలతో మోసం చేస్తే.. వీరు.. ఏకంగా తమ ఇళ్లలోంచి కాలు కూడా కదపకుండా మోసాలు చేస్తారు. అయితేనేం వీళ్లు కూడా ఆ జాబితాలో చేరే కేటుగాళ్లే. వీళ్లూఎప్పుడో ఒక్కపుడు దొరక్క తప్పదు. కటకటాలు లెక్కించక తప్పదు. సాంకేతికతను అత్యంత చాకచక్యంగా వాడే తెలివి ఉన్నప్పుడు.. వీరు ఎందుకనో వాటిని సక్రమమైన మార్గంలో పెట్టడం లేదో ఎవరికీ అర్థంకాదు.

కొత్త పంథాల్లో డబ్బు దోచుకుంటున్న వీరు.. ఆ డబ్బును అవతలి వ్యక్తి ఎంతగా శ్రమించి కూడబెడుతున్నాడో కూడా తెలుసుకుంటే.. అప్పుడు ఎదుటి వారి నుంచి ఊరికే డబ్బులు అడగాలన్నా బాధ అనిపిస్తుంది. కానీ ఉడుకు రక్తం వక్రమార్గం భాట పట్టిస్తుంది. ఆ జోష్ లో సైబర్ నేరాలకు పాల్పడి ఎదుటివారి డబ్బును కోట్టేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మరో కొత్త పంథా తాజాగా వెలుగుచూసింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.20వేలు కాజేశారు. అతడికి అసలు పేటీఎం ఖాతా లేకపోయినా.. ఆ పేరుతో డబ్బు కొట్టేయడం విశేషం. పేటీఎం ఖాతా లేకపోయినా.. ఆ పేరుతో డబ్బులు కాజేసిన ఘటన కేరళలో చర్చనీయాంశమైంది. రూ.20వేలు పోగొట్టుకున్న వ్యక్తి.. తనకు న్యాయం చేయాలంటూ బ్యాంకు, పోలీస్ స్టేషన్​ చుట్టూ తిరుగుతున్నాడు.

ఇలాంటి కేసును ఎప్పుడూ చూడని బ్యాంకు సిబ్బంది, పోలీసులు.. ఏం చేయాలా అని తలపట్టుకుంటున్నారు. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే..అనీస్​ రహ్మాన్.. కేరళ మలప్పురం జిల్లా వండూర్ వాసి. బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకున్న అతడికి ఊహించని షాక్ తగిలింది. దాదాపు రూ.20వేల రూపాయలు విత్​డ్రా అయినట్లు తెలిసింది. వెంటనే అతడు బ్యాంకుకు వెళ్లి.. ఏం జరిగిందని ఆరా తీశాడు. మూడు సందర్భాల్లో పేటీఎం ద్వారా డబ్బు డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. అసలు తనకు పేటీఎం అకౌంట్ లేదని, ఈ బ్యాంకు ఖాతాతో లింక్ కాలేదని అనీస్ చెప్పాడు.

ఇది సైబర్ మోసగాళ్ల పని అయి ఉంటుందని ఫిర్యాదు చేశాడు. ఇలాంటి కేసు రావడం తమకు తొలిసారని బ్యాంకు అధికారులు చెప్పారు. యూపీఐ సంబంధిత వివాదాలన్నీ బ్యాంకు ఐటీ విభాగం పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సాంకేతిక సమస్యలతో నగదు బదిలీ జరిగి ఉంటే.. తిరిగి ఇచ్చేస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. అయితే.. ఈ వ్యవహారం మోసపూరితంగా కనిపిస్తున్నందున.. సైబర్ నేరగాళ్ల పని అయి ఉంటుందన్న అనుమానంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసలు ఈ మోసానికి ఎలా పాల్పడి ఉంటారా అని అధికారులు, పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు పక్కా ప్రణాళికతో ఇలా చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. తొలుత ఒక్క రూపాయి మాత్రమే బదిలీ చేసి, ఆ తర్వాత రూ.9999, మూడోసారి రూ.8635 ట్రాన్స్​ఫర్​ చేసినట్టుగా ఉన్న స్టేట్​మెంట్ సహా ఇతర అంశాల ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles