జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో భారత భద్రతా బలగాలు.. పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను హతమార్చాయి. రాష్ట్రంలోని ఉత్తర కాశ్మీర్ ప్రాంతంలోగల కుప్వారా జిల్లాలోని జుమాగండ్ ప్రాంతంలో ఇవాళ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భారత భద్రత బలగాలు పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. కుప్వారా జిల్లాలోని జుమాగండ్ గ్రామంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.
స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా జరిపిన సెర్చ్ ఆపరేషన్ పసిగట్టిన ఉగ్రవాదులు.. గాలింపు బృందంపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ చెప్పారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు జుమాగండ్ గ్రామంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదాడులు జరుపాయి. ఈ ప్రతిదాడుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ మేరకు కాశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ మీడియాకు వివరాలు తెలిపారు. కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు ప్రతీగా జరిపిన కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. ఇదిలాఉండగా, నిన్న బరాముల్లా జిల్లాలోని ఖేరి ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను లొంగిపోవాలని సూచించినా.. కాల్పులకు తెగబడటంతో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులు మరణించిన విషయం తెలిసిందే. స్థానిక పోలీసులు.. భద్రతాదళాలతో కలసి ఖేరీ ప్రాంతానికి చేరుందుకు వెళ్తుండగా, నాజీభట్ క్రాసింగ్ వద్దకు చేరుకున్న తరువాత ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో కాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ వీరమరణం పోందాడు.
కాగా, బుధవారం రాత్రి బుద్గాం జిల్లా చదూరలో ఓ టీవీ నటిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో టీవీ నటి అమ్రీన్ భట్ తన మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ (10)తో కలిసి ఇంటి బయట ఉండగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆమె మరణించగా, తీవ్రంగా గాయపడిన జుబైర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ పోలీసు కూడా వీర మరణం పొందిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more