సెక్స్ వర్కర్ల ఎన్నో ఏళ్ల కల ఇవాళ సాకారమైంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం వారికి భారీ ఊరట కల్పించింది. ఇక సెక్స్ వర్కర్లపై క్రిమినల్ చర్యలు చేపట్టరాదని అత్యున్నత న్యాయస్థానం పోలీసులకు తాజా అదేశాలను జారీ చేసింది. వారు సమ్మతితోనే ఆ వృత్తి కొనసాగుతుంటే ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. వ్యభిచారం అనేది వృత్తి అని, చట్ట ప్రకారం సెక్స్ వర్కర్లు గౌరవంతో జీవించేలా వారికి రక్షణ ఉండాలని స్పష్టం చేసింది.
సెక్స్ వర్కర్ల హక్కులను పరిరక్షించేందుకు ఆరు కీలక ఆదేశాలను జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జారీ చేసింది. సెక్స్ వర్కర్ వయోజనురాలై ఆమె సమ్మతితో వృత్తిని కొనసాగిస్తుంటే పోలీసులు జోక్యం చేసుకోరాదని, ఆయా సెక్స్ వర్కర్లపై క్రిమినల్ చర్యలకు దూరంగా ఉండాలని కీలక ఉత్తర్వులు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి అనుగుణంగా దేశంలోని ప్రతి పౌరుడికి గౌరవంతో జీవించే హక్కు ఉందని బెంచ్ స్పష్టంచేసింది. సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయరాదని, శిక్షించడం, వేధించడం చేయరాదని పేర్కొంది.
స్వచ్ఛందంగా వృత్తిలో పాల్గొనడం చట్టవిరుద్ధం కానందున వ్యభిచార గృహాలపై దాడుల్లో వారిని బాధితులుగా చూడరాదని తెలిపింది. సెక్స్ వృత్తిలో ఉన్నదనే ఏకైక కారణంతో సెక్స్ వర్కర్ పిల్లలను తల్లి నుంచి వేరుచేయరాదని ఆదేశించింది. కనీస భద్రత, గౌరవంగా జీవించే హక్కు సెక్స్ వర్కర్లు, వారి సంతానానికి వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. సెక్స్ వర్కర్లపై లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదులు వచ్చిన సందర్భంలో ఆయా కేసుల్లో సెక్స్ వర్కర్ల పట్ల వివక్ష చూపరాదని పోలీసులను ఆదేశించింది. సెక్స్ వర్కర్లపై లైంగిక వేధింపులు జరిగితే వారికి తక్షణమే వైద్య, న్యాయపరమైన సాయం అందించాలని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more