అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకీ కలకలం రేపింది. అగ్రరాజ్యంలోని టెక్సాస్ నగరం, ఉవాల్డేలోని ఎలిమెంటరీ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు తుపాకీతో పాఠశాలలోని తరగతి గదిలోకి ప్రవేశించి.. 19 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులను కాల్చిచంపిన విషాదంలో రక్తపు మరకలు కూడా చల్లారక ముందే మరో విద్యార్థి తుపాకీతో అదే టెక్సాస్ నగరంలోని పాఠశాలల వద్ద సంచరించడం తీవ్ర కలకలం రేపింది. 21 మంది పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలు గాలిలో కలసి 24 గంటలు కూడా గడవకముందే మరో విద్యార్థి తుపాకులతో సంచరించడం గమనార్హం.
టెక్సాస్‌లోని రిచర్డ్‌సన్ స్కూల్‌లో ఓ హైస్కూల్ విద్యార్థి తుపాకీతో తిరుగుతున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన తరలివచ్చిన వారు ఓ యువకుడిని అదుపులోకి తీసుకన్నారు. అయితే అతని వద్ద తుపాకులు ఏమీ లేవని. కాగా అతని కారులో మాత్రం ఒక రైపిల్, ఒక తుపాకీ లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకముందే పోలీసులు ఈ యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, అమెరికాలోని టెక్సాస్‌లో ఉవాల్దేలో సాల్వడోర్ రామోస్ అనే 18 ఏళ్ల యువకుడు ఉన్మాదానికి పాల్పడి ఏకంగా 21 మందిని హతమార్చిన ఘటన తెలిసిందే. కాగా తన పుట్టిన రోజు సందర్భంగా తుపాకీ కొనుగోలు చేసిన రామోస్.. ముందు తన నానమ్మను కాల్చిచంపి.. ఆ తరువాత రాబ్ స్కూల్ లోకి వెళ్లి అక్కడ దాదాపుగా నలబై నిమిషాల నుంచి గంట పాటు అదే స్కూల్ లో ఉండి.. ఒక తరగతి గదిలోకి వెళ్లిన తరువాత అక్కడ ముక్కుపచ్చలారని చిన్నారులపై విఛక్షణా రహితంగా కాల్పులు జరిపాడు, ఈ కాల్పుల్లో 21 మంది మరణించగా వారిలో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. కాగా పోలీసులు జరిపిన కాల్పుల్లో హంతకుడు హతమైన విషయం తెలిసిందే.
కాగా, నిన్న జరిగిన ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల ఘటనలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినబడతున్నాయి. పోలీసులు స్కూలు అవరణకు చేరుకున్నా.. లోనికి వెళ్లడానికి మాత్రం మీనమేషాలు లెక్కించారని, అందుకనే ఈ దారుణఘటన ఉత్పన్నమయ్యిందన్న విమర్శలు వినిపించాయి. దుండగుడి దాడిలో తమ బిడ్డ జాక్లీన్ కాజారెస్ ను కోల్పోయిన బాధితులు స్పందిస్తూ.. పాఠశాల అవరణలో కాల్పుల శబ్దం వినిపిస్తున్నా.. పోలీసులు గుమ్మిగూడారే తప్ప లోనికి వెళ్లలేదని తెలిపారు.
రామోస్ తన ట్రక్కును స్కూల్ దగ్గర ఢీకొట్టడంతో పాటు పొరుగున ఉన్న అంత్యక్రియల ఇంటి ఆవరణలోని ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరపడం చూసిన మహిళలు.. పోలీసు అధికారులు చేరుకోగానే “అక్కడికి వెళ్లండి! అక్కడికి వెళ్లండీ!" అని అరిచినా పోలీసులు వివాదాస్పద సమయపాలన సంకేతాలను అందించారని వారు తెలిపారు. టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ మాట్లాడుతూ, రామోస్ మొదటిసారి పాఠశాల భద్రతా అధికారిపై కాల్పులు జరిపినప్పుడు-ఆ తర్వాత కాల్పులు జరపడానికి మధ్య నలభై నుంచి గంట పాటు సమయం తీసుకోన్నాడని తెలిపారు. భవనం వెలుపల ఉన్న ఇద్దరు ఉవాల్డే పోలీసు అధికారులు, చివరకు రామోస్‌ను తుదముట్టించింది.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more