నాగర్ కర్నూల్ జిల్లా మద్యం ప్రియుల అదృష్టం కలసివచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న వారంలో.. నాగర్ కర్నూలుకు జిల్లా కేంద్రానికి సమీపంలో మందుబాబులకు మద్యంబాటిళ్లు ఉచితంగా లభించాయి. అదెలా అంటే.. ఇటీవల ఏపీలోని ప్రకాశం జిల్లాలో బీరు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో.. అక్కడి మందుబాబులు పండుగ చేసుకున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ మందుబాబుల వంతు వచ్చింది. జిల్లాలోని మంతటి చౌరస్తా వద్ద ప్రమాదవశాత్తూ మద్యం తరలిస్తున్న వాహనం బోల్తాపడింది. దీంతో మంతటి ప్రజలు సంబరంలో మునిగితేలారు. దొరికిన వారికి దొరికినంత మద్యాన్ని తీసుకెళ్లారు.
ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకోగా.. బొలేరో వాహన డ్రైవర్ ను పట్టించుకున్నవారు లేరు కానీ.. మద్యం బాటిళ్లను మాత్రం అక్కడివారు ఎత్తుకెళ్లారు. మద్యం బాటిళ్లను తరలిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో బీరు, లిక్కర్ బాటిళ్లు ప్రయాణికులు, వాహనదారులు దొరికినకాడికి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. అచ్చంపేట పట్టణానికి చెందిన సుభాష్ మద్యం దుకాణందారులు బొలేరో వాహనంలో లిక్కర్ కాటన్లను తీసెకెళ్తున్నారు. తిమ్మాజిపేట లిక్కర్ డిపో నుంచి రూ. 5 లక్షల మద్యం లోడుతో మినీ డీసీఎం అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి వెళ్తుంది.
అయితే నాగర్ కర్నూల్ మండలం మంతటి చౌరస్తా సమీపానికి రాగానే అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. దీంతో బీరు బాటిల్, లిక్కర్ బాటిళ్లు పగిలి మద్యం రోడ్డు పాలైంది. చాలా వరకు మద్యం బాటిళ్లను వాహనదారులు, ప్రయాణికులు లూటీ చేశారు. దాదాపు రూ. మూడున్నర లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అచ్చంపేట పట్టణానికి చెందిన సుభాష్ మద్యం దుకాణందారులు బొలేరో వాహనంలో లిక్కర్ కాటన్లను తీసెకెళ్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more