పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ దేశరాజకీయాల్లోనే వినూత్నంగా తన మార్కు రాజకీయాలపై ముద్రవేశారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి మూలసూత్రమైన అవినితిపై రాజీలేని పోరాటం చేస్తామని.. ఈ విషయంలో తన, పర బేధాలకు కూడా తావులేదని ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీఇచ్చిన సీఎం.. అదే విధంగా అములు కూడా చేసిచూపించారు. అవినీతి ఆరోపణలపై మంత్రివర్గ సహచరుడిని పదవి నుంచి తొలగించారు. వైద్య శాఖ మంత్రి విజయ్ షింగ్లా అవినీతిపై కచ్చితమైన సాక్ష్యాధారాలు లభించడంతో ఆయనను పదవి నుంచి తప్పించినట్లు సీఎంఓ తెలిపింది. ఆప్ నిజాయితీ కలిగిన పార్టీ అని సీఎం మన్ వ్యాఖ్యానించారు.
`కాంట్రాక్టుల్లో, , శాఖాపరమైన కొనుగోళ్లలో అధికారుల నుంచి 1% కమిషన్ డిమాండ్ చేశారు. ఆయన అవినీతిపై కచ్చితమైన సాక్ష్యాధారాలు లభ్యమయ్యాయి` అని షింగ్లాను పదవి నుంచి తొలగించడానికి కారణాలను సీఎంఓ ఒక ప్రకటనలో వివరించింది. అవినీతి ఏ రూపంలో ఉన్నా.. ఎంత చిన్నగా ఉన్నా దానిని తమ పార్టీ, ప్రభుత్వం సహించబోమని అందరికీ ఈ చర్యతో హెచ్చరికలు జారీ చేసింది మన్ ప్రభుత్వం. పదవి నుంచి తొలగించిన కాసేపటికి విజయ్ షింగ్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. షింగ్లాను వైద్య శాఖ మంత్రి పదవి నుంచి తొలగించిన అనంతరం ముఖ్యమంత్రి భగవంత్ మన్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
`ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ. ఒక్క రూపాయి అవినీతిని కూడా ప్రభుత్వం సహించదు. ఈ విషయంలో ప్రజలు మాపై విశ్వాసం ఉంచారు. తాను రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్న సమయంలో.. అవినీతి కూపం నుంచి బయటవేసే వ్యక్తి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు మాకు అర్థమైంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించే సమయంలో పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక లక్ష్యాన్ని నాకు స్పష్టంగా చెప్పారు. అవినీతిని సహించబోనని నేను ఆయనకు ప్రామిస్ చేశాను. వైద్య శాఖ మంత్రి అవినీతి విషయం ఇటీవలే నా నోటీస్కు వచ్చింది. ఈ విషయం మీడియాకు కూడా తెలియదు.
నేను ఈ అవినీతిని దాచేయవచ్చు. కానీ, నేను అలా చేస్తే మమ్మల్ని నమ్మిన లక్షలాది మంది ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. అందుకే ఆ మంత్రిని పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాను` అని ఆ వీడియోలో సీఎం భగవంత్ మన్ వివరించారు. అవినీతికి పాల్పడినట్లు విజయ్షింగ్లా కూడా ఒప్పుకున్నారని మన్ వెల్లడించారు. గతంలో కూడా ఆప్ ఇలా ఒక మంత్రిని అవినీతి ఆరోపణలపై పదవి నుంచి తొలగించిన విషయాన్ని మన్ గుర్తు చేశారు. 2015లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పౌర సరఫరాల మంత్రిని ఇలాగే అవినీతి ఆరోపణలపై తొలగించారని తెలిపారు. విజయ్ షింగ్లాను వైద్య శాఖ మంత్రి పదవి నుంచి తొలగించిన కొద్ది గంటలకు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more