ఆర్ఎంపీల ప్రవర్తనా నియమావళి ముసాయిదా విడుదల NMC releases Draft RMP Professional Conduct

Nmc releases draft registered medical practitioner professional conduct regulations 2022

National Medical Commission, new regulations, Professional Conduct of RMP, Registered Medical Practitioners (RMPs), duties and responsibilities, professional development program, remuneration, prescribtion, generic medicine, prohibition of commission, restriction on advertisement, responsibilities, sale of drugs, medical reports, website, Ethics and Medical Registration Board, Registered Medical Practitioner Professional Conduct Regulations 2022, Healthcare Professionals, Professional Misconduct, NMC Code of Methical Ethics, CPD Program, Telemedicine Practice, comments

Addressing various issues of professional conduct of registered medical practitioners, the Ethics & Medical Registration Board (EMRB) of the National Medical Commission (NMC) has introduced Draft of National Medical Commission, Registered Medical Practitioner (Professional Conduct) Regulations, 2022. While releasing the draft of the regulations, the NMC has invited comments from the public and stakeholders and the last date to send the comments is June 22.

వైద్యులు జనరిక్ మందులను మాత్రమే రాయాలి: ముసాయిదా నియమావళి విడుదల

Posted: 05/24/2022 03:04 PM IST
Nmc releases draft registered medical practitioner professional conduct regulations 2022

వైద్యులు వృత్తిపరంగా ఎలాంటి నియమనిబంధనలు పాటించాలో పొందుపరుస్తూ తాజాగా జాతీయ మెడికల్ కమీషన్ ఓ ముసాయిదా నియమావళి-2022ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రతిని వారికి సంబంధించిన ఓ వైబ్ సైట్లో పొందుపర్చింది. అంతేకాదు.. ఈ ముసాయిదాపై ఎవరికైనా ఏ విధమైన అభ్యంతరాలు ఉంటే వెంటనే కామెంట్ల రూపంలో వాటిని పోందుపర్చాలని సూచనలు చేసింది. ఈ ముసాయిదా అమల్లోకి వస్తే.. ఇకపై రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు తమ వద్దకు వచ్చే రోగులకు అనవసరమైన కాంబినేషన్ కలయికలను రాయకుండా.. పూర్తిగా జనరిక్ మందులే రాయనున్నారు.

షాపులు పెట్టి మందులు విక్రయించకూడదని చెబుతూ నేషనల్ మెడికల్ కమిషన్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ప్రొఫెషనల్ కాండక్ట్) రెగ్యులేషన్-2022 పేరుతో జాతీయ వైద్య కమిషన్ ఓ నియమావళిని తన వెబ్‌సైట్‌లో పెట్టింది. వైద్యుల వృత్తి నియమావళి ముసాయిదాపై ఏవైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే వచ్చే నెల 22 లోగా తమకు తెలియజేయాలని కోరింది. ఎన్ఎంసీ నియమావళి ప్రకారం..  వైద్యులు బ్రాండెడ్ మందులను రాయకూడదు. బదులుగా జనరిక్ మందులనే రాయాలి. అనవసరమైన మందులు, కాంబినేషన్స్ సిఫార్సు చేయకూడదు.  

అలాగే, వైద్యులు మందుల షాపులు పెట్టి రోగులకు ఔషధాలను విక్రయించకూడదు. అయితే, తన వద్దకు వచ్చే రోగులకు మాత్రం వైద్యులు అవసరమైన మందులను విక్రయించే వెసలుబాటు కల్పించింది. ఒక వైద్యుడు రాసిన మందులను మరో వైద్యుడు రోగులకు విక్రయించకూడదు. ఆపరేషన్‌కు ముందు రోగుల నుంచి అంగీకార పత్రాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. రోగికి ఒకవేళ అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చిన సందర్భంలో అతడి అటెండెంట్స్ ఎవరూ లేకపోతే వైద్యుడే నిర్ణయం తీసుకోవచ్చని ఎన్ఎంసీ తన ముసాయిదాలో పేర్కొంది. అలాగే, రోగికి ఒకేసారి రెండుమూడు ఆపరేషన్లు చేయాల్సి వచ్చిన సందర్భంలో అవేంటో, ఎందుకు చేయాలో చెబుతూ రోగి నుంచి అంగీకార పత్రం తీసుకోవాలి.

తన వద్దకు వచ్చిన పేషెంట్‌కు చికిత్స ఖర్చు ఎంత అవుతుందో ముందుగానే చెప్పాలి. ఆ మొత్తాన్ని అతడు భరించలేకుంటే చికిత్స నిరాకరించే హక్కు వైద్యులకు ఉండదు. అన్నింటికంటే ముఖ్య విషయం.. బహుళజాతి ఫార్మా కంపెనీల నుంచి తాము ఎలాంటి ప్రతిఫలం పొందలేదని నిర్ధారిస్తూ వైద్యులు ఓ అఫిడవిట్‌ను ప్రతి ఐదేళ్లకోసారి ఎన్ఎంసీకి ఇవ్వాల్సి ఉంటుంది. రోగుల వివరాలను చట్టపరంగా అవసరమైతే తప్ప ఎట్టిపరిస్థితుల్లోనూ బహిరంగంగా వెల్లడించకూడదు. ఎన్ఎంసీ వైద్య వృత్తి నియమావళిని అతిక్రమిస్తే మాత్రం వైద్యుల లైసెన్స్‌ను రద్దు చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh