IMD predicts early monsoon arrival మేఘసందేశం: వారం ముందుగానే తొలకరి పలకరింత..

Southwest monsoon may arrive a week early over south andaman sea imd

Southwest monsoon, Andaman and Nicobar, Kerala, Bay of Bengal, India Meteorological Department, IMD, Mrutyunjay Mohapatra, Rains in India, rain monsoon, southwest monsoon rains, weather news, weather forecast, todays weather

The Southwest Monsoon is likely to arrive a week in advance over South Andaman Sea, according to the India Meteorological Department (IMD). The IMD said monsoon advance is expected around May 15, while the normal onset date over South Andaman Sea is around May 21 or 22.

చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ.. వారం ముందుగానే తొలకరి పలకరింత..

Posted: 05/13/2022 02:12 PM IST
Southwest monsoon may arrive a week early over south andaman sea imd

ఠారెత్తిస్తున్న ఎండల నుంచి తెలుగు రాష్ట్రాలు గత నాలుగు రోజులుగా ఉపశమనం పోందాయి. అసని తుపాను ప్రభావంతో తెలుగురాష్ట్రాలు చల్లబడ్డాయి. అయితే అసని తుపాను చల్లబడిన తరువాత మళ్లీ ఎండలు భగభగమండతున్నాయి. ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ 'చల్లటి' కబురు చెప్పింది. ఈ ఏడాది.. నైరుతి రుతుపవనాలు సాధారణం కన్నా ముందుగానే వస్తాయని అంచనావేసింది. అసని తుపాను ప్రభావం కూడా రుతుపవనాలు నిర్ణీతం కన్నా వారం రోజుల ముందే.. దేశంలోకి ప్రవేశించేందుకు దోహదం చేశాయని పేర్కొంది. సాధారణంగా మే చివరి వారంలో అండమాన్​ నికోబార్​ దీవులను చుట్టి.. జూన్​ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి.

ఈసారి ఈ ప్రక్రియ కాస్త ముందుగానే జరుగుతుందని ఐఎండీ అంచనా వేసింది. "అనుకున్న దానికన్నా ముందే.. దక్షిణ అండమాన్​ సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నెల 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని చూట్టేయవచ్చు. సాధారణంగా ఈ ప్రక్రియ మే 22 వరకు జరగాల్సి ఉంది. ఇక ఈఏడాది కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నాము, " అని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు అండమాన్​ నికోబార్​ దీవుల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. అదే సమయంలో ఐదురోజుల పాటు కేరళ, లక్షద్వీప్​ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

అండమాన్​ దీవుల్లో రుతుపవనం ప్రవేశించడం.. దేశంలో నాలుగు నెలల వర్షాకాలనికి సూచన. ఇక రుతుపవనాలు కేరళను తాకినప్పుడు వానాకాలం మొదలైనట్టు భావిస్తారు.
అసని తుపాను ప్రభావంతో దక్షిణ భారతంలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. కానీ భానుడి భగభగలతో ఉత్తర భారతం అల్లాడిపోతోంది. రాజస్థాన్​ బార్మేర్​లో గురువారం ఏకంగా 48డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్​లోని 29 నగరాలు, హరియాణా, గుజరాత్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్రలో 44డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయువ్య భారతంలో మరో 2-3రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత.. ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles