రైల్వే స్టేషన్ల వద్ద కదులుతున్న రైలు ఎక్కడం లేదా దిగడం చేస్తూ పలువురు ప్రయాణికులు రైలు అందుకోవాలన్న అత్రృతలో ప్రమాదాల బారిన పడటం మనకు తెలిసిందే. అయితే పట్టాలు దాటుతుండగా కొందరు... కదులుతున్న రైలు నుంచి పడిపోయి మరికొందరు కూడా ప్రమాదాల బారిన పడుతుంటారు. అయితే రైల్వే స్టేషన్ల వద్ద ప్రమాదాలు జరిగిన సమయాల్లో రైల్వేఅధికారులు దానిని నిలిపివేయడం సాధారణం. కానీ కదులుతూ వెళ్తున్న రైలులోంచి ప్రయాణికులు కిందపడితే.. వారిని కోసం రైలు అగటం ఇప్పటివరకు వినలేదు. కానీ తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ప్రయాణికుడి కోసం రైలు ఆగడం కాదు.. ఏకంగా రెండు రిలోమీటర్ల దూరం వెనక్కువచ్చి మరీ అసుపత్రికి తరలించింది.
మద్యప్రదేశ్ లో వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ యువకుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ విషయాన్ని రైలు ప్రయాణికులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. ప్రయాణికుడికి తక్షణ సాయం అందించాలన్న ఉద్దేశ్యంతో అదే రైలును వెనక్కు వెళ్లి ఆపన్నహస్తం అందించాలని సూచించారు. ఇక ఆ మార్గంలో వేరే రైళ్లు రాకుండా చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే రైలు 2 కి.మీ. ముందుకు వెళ్లిన రైలు.. అదే మార్గంతో వెనక్కి వెళ్లింది. తీవ్రగాయాలతో పట్టాలపై పడిఉన్న బాధితుడిని రైలులో ఎక్కించుకుని వచ్చి సకాలంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన తపతి గంగా ఎక్స్‌ప్రెస్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని మీర్జాపూర్ జిల్లా వింధ్యాచల్ గ్రామానికి చెందిన 19ఏళ్ల దీపక్ .. తన మామతో కలసి పనినిమిత్తం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్తున్నాడు. ఇందుకోసం వారు తపతి గంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రైలు కొద్ది దూరం వెళ్లాక.. తన సీటులో నుంచి లేచిన దీపక్.. ప్రయాణికులు ఎక్కే ద్వారం వద్ద కూర్చున్నాడు. ఆ తర్వత మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని చర్ఖేడా స్టేషన్ సమీపంలో నిద్రలోకి జారుకున్న దీపక్ హఠాత్తుగా రైలు నుంచి ట్రాక్‌పై పడిపోయాడు. రైలు నుంచి ఓ ప్రయాణికుడు కిందపడిపోయాడని తెలిసి.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ప్రమాదవశాత్తు ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు నుంచి కింద పడిపోయాడని రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే అధికారులు సకాలంలో స్పందించారు. అతడి ప్రాణాలను కాపాడేందుకు... మళ్లీ అదే రైలును వెనక్కి పంపించారు. దీపక్ కింద పడిపోయాక.. రైలు దాదాపు రెండు కి.మీ. ముందుకెళ్లింది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తీసుకెళ్లి.. తీవ్ర గాయాలతో రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న దీపక్‌ని ట్రైన్లో ఎక్కించారు. ఆ తర్వాత హర్దా రైల్వే స్టేషన్లో దింపారు. అక్కడి నుంచి హర్దా జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం భోపాల్‌కు షిప్ట్ చేశారు. ప్రస్తుతం దీపక్ పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more