Zydus launches drug to treat LDL-Cholesterol బ్యాడ్ కొలస్ట్రాల్ నియంత్రణకు సరికొత్త ఔషధం..

Zydus launches bemdac drug to treat uncontrolled ldl cholesterol

Zydus Lifesciences Ltd, Cadila Healthcare Ltd, Bemdac, Bempedoic acid, uncontrolled levels of LDL, LDL-Cholesterol, (LDL-c), blood vessels, health problems, heart attack, stroke. Uncontrolled LDL-c, major risk factor, cardiovascular diseases

Zydus Lifesciences Ltd, a discovery-driven global lifesciences company announced the launch of Bemdac (Bempedoic acid), a new class of drug for the first time in India. The oral drug ushers in a new line of treatment for patients suffering from uncontrolled levels of LDL-Cholesterol (LDL-c) despite life-style modifications and the use of maximum tolerated dose of statins, which form the cornerstone of dyslipidemia management.

బ్యాడ్ (ఎల్డీఎల్-సి) కొలస్ట్రాల్ నియంత్రణకు జైడస్ సరికొత్త ఔషధం..

Posted: 05/13/2022 12:58 PM IST
Zydus launches bemdac drug to treat uncontrolled ldl cholesterol

హృద్రోగులకు మరో మంచి శుభవార్తను అందించింది జైడస్ లైఫ్ సెన్సెస్ సంస్థ. హృద్రోగాలకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్.. రక్తనాళాలో పేరుకుపోయి.. గుండెపోటుతో పాటు హృద్రోగ సంబంధిత రోగాలకు కూడా దారి తీస్తోంది. ఈ చెడు కొలస్ట్రాల్ నుంచి విముక్తి పోందేందుకు జైడస్ లైఫ్ సైన్సెస్ సంస్థ మరో నూతన ఔషదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. చెడు కొలెస్ట్రాల్‌ ను అదుపులో ఉంచేందుకు బెమ్‌డాక్ బ్రాండ్ పేరుతో బెమ్‌పెడోయిక్ యాసిడ్ డ్రగ్‌ను మార్కెట్లోకి తెచ్చినట్టు తాజాగా జైడస్ లైఫ్ సైన్సెస్ సంస్థ శుక్రవారం వెల్లడించింది.

బెమ్‌డాక్ ఒక కొత్త తరగతికి చెందిన డ్రగ్ అని, జీవనశైలి సరిచేసుకుంటున్నప్పటికీ, గరిష్ఠంగా సహించగలిగే మోతాదులో స్టాటిన్స్ డోస్ తీసుకుంటున్నప్పటికీ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ అదుపులో లేనిపక్షంలో ఈ డ్రగ్ ద్వారా నియంత్రించవచ్చని సంస్థ తెలిపింది. ఇది నోటి ద్వారా తీసుకునే డ్రగ్ అని వివరించింది. ‘బెమ్‌డాక్‌ను ప్రవేశపెట్టడం మాకు సంతోషాన్నిస్తోంది. అదుపులో లేని ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రించగలిగే మెడిసిన్ ద్వారా ఓ పరిష్కారాన్ని చూపుతున్నందుకు ఆనందంగా ఉంది..’ అని జైడస్ లైఫ్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ శార్విల్ పటేల్ అన్నారు.

డిస్‌లిపిడెమియా, కొలెస్ట్రాల్ నియంత్రణలకు ఔషధాన్ని తేవడం ద్వారా జైడస్ పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన ఔషధాలు చేరినట్టయిందని పటేల్ తెలిపారు. ప్రభావవంతమైన వ్యాధి నియంత్రణతో ప్రజలు నాణ్యమైన జీవితాన్ని పొందడానికి తమ మిషన్ ఉపయోగపడుతుందని అన్నారు.ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను సాధారణంగా బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా పిలుస్తారని, ఇది రక్తనాళాల గోడలకు పేరుకుపోతుందని, గుండెపోటు, స్ట్రోక్ తదితర అనారోగ్య సమస్యలు వచ్చే రిస్క్‌ను పెంచుతుందని కంపెనీ తెలిపింది. నియంత్రణ లేని ఎల్‌డీఎల్.. కార్డియోవాస్కులర్ సంబంధిత రోగాలను తయారవడంలో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అని తెలిపింది.

ప్రతి పది మంది భారతీయుల్లో 8 మంది డిస్‌లిపిడెమిక్‌తో బాధపడుతున్నారని, 112 మిలియన్ల మేర వయోజనులు హైలెవల్ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారని జైడస్ పలు అధ్యయనాలను ఉటంకించింది. ప్రతి 10 మంది డిస్‌లిపిడెమియా పేషెంట్లలో ఏడుగురు అదుపులో లేని ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌తో బాధపడుతున్నారని తెలిపింది. దేశంలో 5.4 మిలియన్ల మందికి స్టాటిన్ థెరపీ సానుకూలంగా లేదని కూడా తెలిపింది. బెమ్‌పెడోయిక్ యాసిడ్ స్టాటిన్స్ పడని పేషెంట్లలో, స్టాటిన్స్‌కు స్పందించని పేషెంట్లలో కూడా మంచి ఫలితాలను ఇచ్చిందని జైడస్ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles