Sedition law needs to be reconsidered: Centre దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని పున‌: స‌మీక్షిస్తాం: కేంద్రం

On sedition law government s big climbdown in supreme court

sedition law, supreme court, sedition law, Supreme Court, central government, sedition law provision, central government on sedition law, reconsider sedition law, central government, section 124a, Sedition challenge, Sedition Law, sedition, Indian Penal Code

The Central government on Monday informed the Supreme Court that it had decided to reconsider and re-examine the sedition law or Section 124A of the Indian Penal Code (IPC). In its affidavit, the Centre asked the apex court to await the outcome of the government's exercise and not proceed with hearing the petitions before it. It said a competent forum would look into the matter.

సుప్రీంలో మెట్టు దిగిన కేంద్రం.. దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని పున‌ఃస‌మీక్షిస్తామని వెల్లడి

Posted: 05/09/2022 09:26 PM IST
On sedition law government s big climbdown in supreme court

బ్రిటీషు కాలం నాటి దేశ‌ద్రోహ చట్టం కొనసాగింపుపై ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వినిపించిన వాదనపై కేంద్రం ప్రభుత్వం వెనక్కుతగ్గింది. ఇటీవల ఈ కేసు విచారణ సందర్భంగా దేశద్రోహం చట్టం కొనసాగించాలని, అయితే.. ఈ చట్టం సక్రమంగా అమలు జరిగేట్టుగా చూస్తే చాలునని వాదించిన కేంద్రం తాజాగా ఈ చట్టం అమలుపై యూట‌ర్న్ తీసుకున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. బ్రిటీష్ కాలం నాటి చ‌ట్టాల‌ను ఇంకా కొనసాగిస్తున్నారన్న అంశంలో దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ చట్టాన్ని ర‌ద్దు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న కేంద్ర స‌ర్కార్ తాజాగా దేశ ద్రోహ చ‌ట్టాన్ని పున స‌మీక్షించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇవాళ సుప్రీంకోర్టులో కేంద్రం ఈ విష‌యాన్ని చెప్పింది. ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌(ఐపీసీ)లోని 124ఏ చ‌ట్టాన్ని సంపూర్ణంగా స‌మీక్షించ‌నున్న‌ట్లు కేంద్రం కోర్టుకు విన్న‌వించింది. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ నేప‌థ్యంలో పాతకాలం చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ కోరిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని కూడా ర‌ద్దు చేయాల‌ని భావించారు.

కానీ ఆ చ‌ట్టాన్ని మ‌ళ్లీ స‌మీక్షించ‌నున్నామ‌ని, ఆ చ‌ట్టంలో ఉన్న లోపాల‌ను స‌రిదిద్ద‌నున్న‌ట్లు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పింది. 124ఏ సెక్ష‌న్‌పై పూర్తిగా స్ట‌డీ చేసే వ‌ర‌కు సుప్రీం వేచి ఉండాల‌ని కేంద్రం వెల్ల‌డించింది. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను విమ‌ర్శిస్తున్న వారిపై దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు గ‌త ఏడాది కేంద్రంపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే బ్రిటీష్ కాలంలో మ‌హాత్మా గాంధీ లాంటి వారిని సెలెంట్ చేసేందుకు ఈ చ‌ట్టాల‌ను వాడార‌ని, ఎందుకు ఆ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డంలేద‌ని ఇటీవ‌ల సుప్రీం కూడా ప్ర‌శ్నించింది. 1962లో దేశ‌ద్రోహ చ‌ట్టంపై వ‌చ్చిన తీర్పుపై స‌మీక్షించేందుకు ఈ అంశాన్ని విస్తృత ధ‌ర్మాస‌నానికి పంపేందుకు సుప్రీం ఆలోచిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : central government  section 124a  Sedition challenge  Sedition Law  sedition  Indian Penal Code  

Other Articles