సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంలో ఆయన లవర్ బోయ్‌గా కనిపిస్తూనే కామెడీ టైమింగ్, పంచ్ డైలాగులతో నిండిన ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ మధ్యలో మహేష్ శ్రీకాకుళం యాసలో చెప్పిన డైలాగులు ఫన్నీగా ఉన్నాయి. కీర్తి సురేశ్ చాలా అందంగా కనిపిస్తోంది. బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్ అభిమానులకు కావాల్సిన యాక్షన్, కామెడీ, రొమాన్స్‌లను చేర్చినట్లుగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్‌ధరలను పెంచుకునేందుకు అనుమతిచ్చింది. దీంతో పాటుగా అదనపు ఆటను వేసుకునేందుకు కూడా అనుమతి కూడా ఇచ్చింది. 5వ షో వేసుకునేందుకు మే 12 నుంచి 18 వరకు అవకాశం ఇచ్చింది. వారం రోజుల పాటు ఈ చిత్రం మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.50 పెంచుకునేందుకు అనుమతివ్వగా.. ఏసీ సాధారణ థియేటర్‌లో రూ.30 పెంచుకునే అవకాశం కల్పించింది. ఇక అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ చిత్రం టికెట్ ధరలను పెంచుకునేందుకు చిత్రబృందం అనుమతి కోరింది.
మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంతోని ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేష్.. త్రివిక్రమ్ డైరక్షన్‌లో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది కాకుండా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితోనూ ఓ చిత్రం చేయబోతున్నారు మహేశ్. ఈ సినిమా కోసం సూపర్ స్టార్‌తో పాటు అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.
#SarkaruVaariPaata Nizam Ticket Hike Permission Granted
— Viswa CM (@ViswaCM1) May 9, 2022
Bookings Opens Soon
Get Ready for SuperStar @urstrulyMahesh Mental Mass Swag#SVPMania #SVP pic.twitter.com/bfzAnwr55W
(And get your daily news straight to your inbox)
Aug 17 | స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ.. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగానికి ఆ మరుసటి రోజున.. బీజేపి పాలిత రాష్ట్రంలోనే తూట్లు పోడిచారు. ప్రధాని మోడీ సోంత రాష్ట్రం... Read more
Aug 17 | జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు... Read more
Aug 17 | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని... Read more
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more