Violence Claims Eight Lives As Sri Lanka Faces Economic Crisis రాజపక్స నివాసంలో కాల్పులు.. విపక్ష నేత ప్రేమదాసపై దాడి!

Sri lankan troops on streets after protesters torch leaders homes in night of unrest

Sri Lanka Economic Crisis, Sri Lanka Crisis, Sri Lanka protests, Gotabaya Rajapaksa, Sri Lanka, Sri Lanka politics, sri lanka inflation, Sri Lanka Rajapaksa ancestral house burnt, anti-government protests, Govt Supporters Vandalize anti-government protesters tents, anti-government protesters colombo

Sri Lanka's former prime minister Mahinda Rajapaksa is facing calls for his arrest from Opposition politicians for inciting violence against peaceful anti-government protesters that claimed at least eight lives, left over 200 people injured and saw arson attacks on the homes of several politicians.

హింసాత్మకంగా శ్రీలంక: రాజపక్స నివాసంలో కాల్పులు.. విపక్ష నేత ప్రేమదాసపై దాడి!

Posted: 05/10/2022 11:17 AM IST
Sri lankan troops on streets after protesters torch leaders homes in night of unrest

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ హింసాత్మకంగా తయారవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు హింసాత్మక రూపు దాల్చాయి. ప్రజాగ్రహానికి తలొగ్గిన ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినా.. ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. పైపెచ్చు నిరసనకారులు తమ దుస్థితికి కారణమైన పాలకుల ఇళ్లపై దాడులకు తెగబడటంతో అవి మరింత హింసాత్మకంగా మారాయి. రాజపక్స పూర్వీకులకు సంబంధించిన ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మాజీ ప్ర‌ధాని మ‌హిందా రాజ‌ప‌క్స‌తో పాటు ప‌లు ఎంపీల నివాసాల‌కు ఆందోళ‌న‌కారులు నిప్పు పెట్టారు.

శ్రీలంక రాజ‌ధాని కొలంబోకు 250 కిలోమీట‌ర్ల దూరంలోని హంబ‌న్‌తోట‌లో ఉన్న రాజ‌ప‌క్స పూర్వీకుల ఇంటిని సైతం ఆందోళ‌న‌కారులు వ‌ద‌ల్లేదు. ఆ ఇంటిని కూడా త‌గుల‌బెట్టారు. దీంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇక రాజ‌ప‌క్స రాజీనామా చేసిన‌ట్లు వార్త‌లు తెలియ‌డంతో.. ఆందోళ‌న‌కారులు మరింతగా రెచ్చిపోయారు. బ‌స్సులు త‌గుల‌బెట్ట‌ారు. ప్ర‌భుత్వ ఆస్తుల‌తో పాటు రాజ‌ప‌క్స త‌ల్లిదండ్రుల స్మార‌కాల‌ను ధ్వంసం చేశారు. శ్రీలంకలో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 190 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించేందుకు బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధించారు.

మరోవైపు నిన్న ఆందోళనకారుల నుంచి తప్పించుకుని సమీపంలోని భవనంలోకి వెళ్లిన ఎంపీ అమరకీర్తి ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంకోవైపు ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసపై ఆందోళనకారులు దాడి చేశారు. గాలే ఫేస్ దగ్గర ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ప్రకటించేందుకు సజిత్ వచ్చారు. అప్పటికే అక్కడ ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రేమదాసపై ప్రభుత్వ అనుకూల వర్గీయులు దాడి చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక వర్గీయులు కూడా ఆయనపై దాడికి యత్నించడం గమనార్హం.

ప్రభుత్వాన్ని గద్దెదించడంలో విఫలమయ్యారంటూ దాడికి యత్నించారు. దీంతో ఆయన చాలా దూరం పరిగెత్తి, కారెక్కి పారిపోయారు. శ్రీలంకలో పలుచోట్ల కర్ఫ్యూ విధించినప్పటికీ ఆందోళనలు అదుపులోకి రాకపోవడం గమనార్హం. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స పదవుల నుంచి దిగిపోవాలంటూ నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్న ప్రజలు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశారు. కొలంబోలో అధ్యక్ష కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. దీంతో నిరసనకారులు ప్రభుత్వ మద్దతు దారులపై దాడులకు దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles