"Science Doesn't Lie, Modi Does": Rahul Gandh ప్రధాని మోడీ అబద్దాలు చెబుతున్నారు: కరోనా మృతులపై రాహుల్

On who s 47 lakh covid deaths report rahul gandhi accuses pm of lying

India Covid deaths, Rahul Gandhi, covid, covid-19, covid deaths, who, world health organisation, who covid update, coronavirus india deaths

Congress leader Rahul Gandhi today hit out at the government over a WHO report of 4.7 million "excess" Covid deaths, saying "science does not lie, Prime Minister Narendra Modi does". Mr Gandhi also demanded that the government should support the families that have lost loved ones by giving them the mandated ₹ four lakh compensation.

ప్రధాని మోడీ అబద్దాలు చెబుతున్నారు: కరోనా మృతులపై రాహుల్ గాంధీ

Posted: 05/06/2022 05:33 PM IST
On who s 47 lakh covid deaths report rahul gandhi accuses pm of lying

కోవిడ్ 19 మ‌ర‌ణాల‌కు సంబంధించి ప్ర‌భుత్వం చెబుతున్న లెక్క‌ల క‌న్నా 10 రెట్లు ఎక్కువ మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ ఇచ్చిన నివేదిక‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వపై తనదైన శైలిలో తీవ్రంగా స్పందించారు. సైన్స్ అబ‌ద్ధాలు చెప్ప‌దని, మ‌న ప్ర‌ధాన మంత్రే అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనాతో, క‌రోనా సంబంధిత స‌మస్య‌ల‌తో భార‌త్‌లో గ‌త రెండు సంవ‌త్స‌రాల‌లో 47 లక్ష‌ల మంది చ‌నిపోయార‌ని తాజాగా డ‌బ్ల్యూహెచ్ఓ ఒక నివేదికలో వెల్ల‌డించింది. దీనిపై ప్ర‌భుత్వ తీవ్రంగా మండిప‌డింది.

త‌ప్పుడు గ‌ణ‌న ప‌ద్ధ‌తుల‌ను ఉప‌యోగించి, కోవిడ్ మ‌ర‌ణాల‌ను డ‌బ్ల్యూహెచ్ఓ ఎక్కువ చేసి చూపుతోంద‌ని విమ‌ర్శించింది. క‌రోనా మ‌ర‌ణాల‌పై త‌మ ప్ర‌భుత్వం క‌చ్చిత‌మైన గ‌ణాంకాల‌నే చూపింద‌ని విమ‌ర్శించింది. మ‌రోవైపు, డ‌బ్ల్యూహెచ్ఓ నివేదిక‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. ప్ర‌భుత్వంపై, ప్ర‌ధాని మోదీపై వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు. `కోవిడ్ మ‌హ‌మ్మారితో మ‌న ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్లు 4.8 (4 ల‌క్ష‌ల 80 వేలు) ల‌క్ష‌ల మంది కాదు.. 47 ల‌క్ష‌ల మంది చ‌నిపోయారని డ‌బ్ల్యూహెచ్ఓ చెబుతోంది. సైన్స్ అబ‌ద్ధం చెప్ప‌దు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అబ‌ద్ధాలు చెబుతారు` అని రాహుల్ వ్యాఖ్యానించారు.

క‌రోనా మృతుల కుటుంబాల‌కు రూ. 4 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం చెల్లించాల‌ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. క‌రోనాతో చ‌నిపోయిన‌వారి కుటుంబాల‌కు గౌరవం ఇవ్వండి. ఇప్ప‌టికైనా రూ. 4 ల‌క్ష‌ల ప‌రిహారం వారికి ఇవ్వండి` అని ట్వీట్ చేశారు. రాహుల్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ స్పందించింది. కోవిడ్ మ‌ర‌ణాల‌పై కూడా రాహుల్ రాజ‌కీయం చేస్తున్నార‌ని విమ‌ర్శించింది. కోవిడ్ మ‌హ‌మ్మారితో ప్ర‌పంచ‌వ్యాప్తంగా, కోటిన్న‌ర మంది చ‌నిపోయార‌ని, వారిలో దాదాపు మూడింట ఒక వంతు భార‌త్‌లోనే చ‌నిపోయార‌ని డ‌బ్ల్యూహెచ్ఓ విడుద‌ల చేసిన నివేదిక‌లో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles