SI thrashes youth for complaining against YSRCP leader పిర్యాదిదారుడిపైనే ఎస్ఐ దాడి.. పోలిస్ స్టేషన్ నుంచి గెంటివేత..

Si beats person who tries to file complaint against ysrcp leader video goes viral

SI thrashes complainant, SI thrashes complainant Venu, Complainant, Handicapped mother, Sub-Inspector, YSRCP Leader, Damodar Reddy, Chilamatturu, Sri Satya Sai District, Andhra Pradesh, Crime

In a shocking video, a Sub-Inspector of police was seen thrashing a youth who came to file a complaint against a YSRCP leader. The youth identified as Venu reached the police station at Chilamatturu in Sri Satya Sai district to register a complaint against a YSCRP leader Damodar Reddy alleged that the leader had taken bribe from him to sanction pension for his differently-abled mother who resides in Sanjeevarayunipalli. The victim Venu informed the police to file case as the leader cheated him after receiving money and denied to sanction pension.

ITEMVIDEOS: పిర్యాదిదారుడిపైనే ఎస్ఐ దాడి.. పోలిస్ స్టేషన్ నుంచి గెంటివేత..

Posted: 05/02/2022 11:17 AM IST
Si beats person who tries to file complaint against ysrcp leader video goes viral

పోలీసులు ప్రభుత్వ అదేశాలను అములు పరుస్తూ.. ప్రజలు నిత్యం శాంతిభద్రతలతో పరఢవిల్లేలా విధులు నిర్వహిస్తూంటారు. అయితే రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా రాజకీయ పార్టీలతోనూ అనుబంధం లేకుండా తమ విధులు నిర్వహిస్తారు. కానీ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో మాత్రం తనపై దాడికి యత్రించాడని ఓ బాధితుడు పోలిస్ స్టేషన్ కు వెళ్లగా ఆయనకు పరాభవం ఎదురైంది. పిర్యాదుదారి పిర్యాదును తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పోలీసులు.. ఏకంగా పిర్యాదు చేయడానికి వచ్చిన బాధితుడినే చితకబాది స్టేషన్ నుంచి గెంటివేసి.. మళ్లీ ఇలాంటి పిర్యాదులతో వస్తే.. బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

బాధిత పిర్యాదుదారుడిపై చెలరేగిపోయిన ఎస్ఐ.. ఏవో పాతకక్షలు ఉన్నట్టుగా అతడిని చూడగానే ఆగ్రహంతో ఊగిపోతూ.. ఎడాపెడా కొట్టాడు. తన తల్లి దివ్యాంగురాలి కోటా కింద పెన్షన్ ఇప్పించేందుకు స్థానిక రూ. 5000 తీసుకున్నాడని అరోపిస్తుండగానే.. ఎవడికి రా నువ్వు రూ.5000 ఇచ్చిందీ అంటూ పరుగుపరుగున వచ్చి బాధిత పిర్యాదుదారుడిపై విరుచుకుపడ్డాడు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని ఎస్ఐ చితకబాదుతున్న వీడియోను అక్కడున్న కొందరు స్థానికులు తమ మొబైల్ లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అవుతోంది. ఎస్ఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని సంజీవరాయునిపల్లెకు చెందిన పద్మావతమ్మ దివ్యాంగుల కోటాలో పింఛను అందుకుంటున్నారు. ఆమె టీడీపీ మద్దతురాలన్న కారణంతో పింఛను తొలగించాలంటూ స్థానిక వైసీపీ నేత దామోదర్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారించిన గ్రామ సచివాలయ కార్యదర్శి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నట్టు నిర్ధారించడంతో పింఛను కొనసాగుతోంది. మరోపక్క, తల్లి పింఛనను తొలగించేందుకు దామోదర్‌రెడ్డి ప్రయత్నించినట్టు తెలియడంతో పద్మావతమ్మ కుమారుడు గురువారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లి నిలదీశాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది.

దీంతో వేణు తాగి తన ఇంటి వద్ద గొడవ చేస్తున్నాడంటూ దామోదర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి వేణును మందలించి అక్కడి నుంచి పంపించివేశారు. ఆ తర్వాతి రోజు వేణు మరికొందరితో కలిసి దామోదర్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వేణును చూసిన వెంటనే అకారణంగానే ఎస్సై రంగడు చెలరేగిపోయాడు. దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. వేణును చితకబాదుతున్న వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయి చివరికి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఈ ఘటనపై విచారణ జరిపేందుకు పెనుకొండ డీఎస్పీ రమ్యను నియమించారు.

వేణుపై ఎస్సై రంగడు యాదవ్ దాడిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడిపై చేయిచేసుకోవడమేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? అని ఓ ట్వీట్‌లో నిలదీశారు. వేణుపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలు, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. సీఎం జగన్ స్పందించి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles