international sex racket behind BJP leader Shweta Singh Gaur Murder బీజేపి నేత హత్య కేసు: అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు.. భర్త ప్రమేయం

Husband killed her to hide international sex racket connect bjp leader shweta singh gaur s family

shweta singh gaur family, shweta singh gaur bjp leader, shweta singh gaur, shweta singh gaur death, shweta singh gaur husband, shweta singh gaur husband arrested, shweta singh gaur daughters, shweta singh gaur in laws, Shweta Singh Gaur, BJP leader, criminal case, Deepak Singh Gaur, Russian, Moroccan, African girls, international sex racket, Uttar Pradesh, Crime

The Bharatiya Janata Party (BJP) leader Shweta Singh Gaur died earlier last week and her husband was arrested on Friday. She was found dead at her residence in Banda on Wednesday. Her family had registered a complaint against her husband, who is also a worker at BJP, and her in-laws. It was also alleged that she was living in fear for her life and had recorded her husband’s calls in order to use them as evidence.

బీజేపి నేత హత్య కేసు: అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు.. భర్త ప్రమేయం

Posted: 05/02/2022 12:49 PM IST
Husband killed her to hide international sex racket connect bjp leader shweta singh gaur s family

ఉత్తరప్రదేశ్‌లోని బాండాకు చెందిన బీజేపీ నేత శ్వేతాసింగ్ గౌర్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయం వెలుగు చూశాయి. అమె రాజకీయ ఎదుగుదల ఓర్వలేక ఎవరైనా అమెను అంతమొందించారన్న అన్న అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. లేక ప్రత్యర్థి పార్టీ నేతలు ఈ దారుణానికి ఒడిగట్టారా.. లేక అమెకు వ్యక్తిగత జీవితం, లేక ఆర్థిక సమస్యలు లేక ఇత్రారాత్ర వ్యవహారాలతో ఎవరైనా అమెను హత్యచేశారా.? లేక అమె నిజంగా మరణించిందా.? అన్న కోణాలతో పాటు అన్ని కోణాల్లో పరిశీలించిన పోలీసులు అమె హత్యకేసకు అంతర్జాతీయ  సెక్స్ రాకెట్ కు సంబంధముందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

అయితే అంతర్జాతీయ సెక్స్ రాకెట్ తో అమెకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా.. అందులో భాగమై అమె భర్త.. తన గుట్టు ఎక్కడ బయటపడిపోతుందన్న ఉద్దేశంతో ఆమెను హత్య చేసినట్టు మృతురాలు రికార్డు చేసిన తన భర్త కాల్ రికార్డులద్వారా వెల్లడైంది. తన భర్త చేస్తున్న అక్రమ, దుర్మార్గమైన వ్యాపారాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నఅమె.. దీంతో తనకు ప్రాణహాని ఉందన్న భయంతో శ్వేత రుజువుగా ఉంటాయని భావించి తన భర్త ఫోన్ కాల్స్‌ను రికార్డు చేయడం ప్రారంభించారు. శ్వేత కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆమె భర్త దీపక్ సింగ్ గౌర్, ఆయన తల్లిదండ్రులు, సోదరుడిపై హత్య కేసు పెట్టారు.

బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. రష్యన్, మొరాకో, ఆఫ్రికన్ అమ్మాయిల కోసం శ్వేతాసింగ్ భర్త దీపక్ సింగ్ బ్రోకర్లతో సంప్రదింపులు జరిపారు. ఆయనకు అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్టు ఇది నిరూపిస్తోంది. మరణానికి ముందు అమె తన భర్త ఫోన్ కాల్స్ రికార్డింగుల గురించి తన కుటుంబసభ్యులకు తెలిపారు. రష్యాలోని సెక్స్ వర్కర్లతో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని దాచిపెట్టేందుకు దీపక్ ఆమెను హత్యచేసి ఉంటాడని ఆమె సోదరుడు రితురాజ్ ఆరోపించారు. ఓ ఆడియో రికార్డింగులో రష్యన్ అమ్మాయిలను సరఫరా చేసే వ్యక్తితో మాట్లాడుతూ.. ‘నేను బాండా నుంచి వచ్చాను.

సునీల్ సింగ్ గౌతమ్ మీ నంబరు ఇచ్చారు. ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు నన్ను హోటల్‌కి పంపిస్తారా? లేదంటే నేనే రావాల్సి ఉంటుందా?' అని ప్రశ్నించారు. అంతేకాదు, మీ వద్ద రష్యన్, ఆఫ్రికన్ అమ్మాయిలు కూడా ఉన్నారా? అని అడగడం కూడా ఆ ఆడియోలో వినిపించింది. వారి ఫొటోలు, రేట్లు పంపిస్తే వారిలో ఒకరిని ఎంపిక చేసుకుంటానని చెప్పారు. మరో ఆడియో క్లిప్‌లో.. బ్రోకర్ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించమంటున్నారని, కానీ తాను నగదు చెల్లిస్తానని చెప్పారు. ఇంకో ఆడియోలో.. రూ. 20 వేలకు ఇద్దరు అమ్మాయిలు.. ఒకరు రష్యన్, మరొక ఇండియన్‌ యువతులను పంపాలని కోరారు. చివరికి ఒక రష్యన్, మరో మొరాకో అమ్మాయి కోసం రూ. 23 వేలకు వారి మధ్య ఒప్పందం కుదిరింది.

మరో ఆడియోలో దీపక్ ఓ రష్యన్ అమ్మాయిని అడగ్గా బ్రోకర్ మాత్రం తన వద్ద మొరాకో అమ్మాయి మాత్రమే ఉందని చెప్పాడు. అప్పుడు దీపక్.. తాము నలుగురం ఉన్నామని, కాబట్టి ఒక ఇండియన్ అమ్మాయి కూడా కావాలని కోరారు. ఈ సంభాషణ చాలాసేపు నడిచింది. అనంతరం దీపక్.. తాను లక్నోలోని నాకా హిందోళ ప్రాంతంలో ఉన్న ఎంజే ఇంటర్నేషనల్ హోటల్‌లో ఉన్నట్టు చెప్పారు. అక్కడికే ఇద్దరు అమ్మాయిలను పంపాలని కోరారు. కాగా, దీపక్ సింగ్‌ను గత శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసుకు సంధించి పలు వీడియోలు కూడా అందుకున్నట్టు ఎస్పీ అభినందన్ చెప్పారు. అన్నింటిపైనా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh