బిగ్‌బాస్ రియాలిటీ షో అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిగా ఉందని, దీనివల్ల యువత పెడదారి పడుతోందంటూ దాఖలైన పిల్‌పై స్పందించిన ఏపీ హైకోర్టు.. మంచి పిల్ వేశారంటూ పిటిషనర్‌ను ప్రశంసించింది. దీనిని సోమవారం విచారిస్తామన్న ధర్మాసనం.. బిగ్‌బాస్ వంటి షోల వల్ల యువత పెడదారిపడుతోందని వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటివల్ల సమాజంలో విపరీత పోకడలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
బిగ్‌బాస్ షో అశ్లీలతను, అసభ్యతను ప్రోత్సహించేలా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఇది విచారణకు నోచుకోకపోవడంపై నిన్న పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. స్పందించిన న్యాయస్థానం.. మంచి వ్యాజ్యమని ప్రశంసించింది. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అశ్లీలత పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
తమ పిల్లలు బాగున్నారని, ఇలాంటి షోలతో తమకేం పని అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొంది. ఇతరుల గురించి పట్టించుకోకపోతే భవిష్యత్తులో మనకు సమస్య ఎదురైనప్పుడు వారు కూడా పట్టించుకోరని వ్యాఖ్యానించింది. 2019లో వ్యాజ్యం దాఖలు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు పొందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదే విషయమై పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం.. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more