టీటీడీ పాలక మండలి సమావేశం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాలక మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకి త్వరగా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం స్లాట్ విధానం ప్రారంభిస్తామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నడకదారి భక్తులకి దివ్యదర్శనం టికెట్ల కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని, మహారాష్ట్ర ప్రభుత్వం ముంబాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పది ఎకరాల స్థలం కేటాయించారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య తాక్రే నేడు స్థలానికి సంబంధించిన పత్రాలు అందించారు. దాదాపు 500 కోట్లు విలువ చేసే స్థలం. త్వరలోనే ముంబాయి లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేపడతాం. ఆలయ నిర్మాణానికి పూర్తి ఆర్థికంగా ఇవ్వడానికి గౌతమ్ సింఘానియా ముందుకొచ్చారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు
టీటీడీ పాలక మండలి నిర్ణయాలు...
* శ్రీవారి మెట్టు మార్గం మే 5 నుంచి ప్రారంభం
* శ్రీవారి ఆలయం లో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం.
* పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల నిర్మాణానికి 21 కోట్లు కేటాయింపు. మరో ఏడాదిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి.
* విపత్తుల సమయంలో ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురికాకుండా కమిటి సూచనలు. అనేక ప్రాంతాలలో ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి
* రెండు విడతలుగా మరమ్మత్తులు.. 36 కోట్లు ఘాట్ రోడ్డు మరమ్మత్తులు
* తిరుమలలో బాలాజీ నగర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు
* బయో గ్యాస్ ద్వారా అన్నప్రసాద కేంద్రం, లడ్డు తయారీకి ఉపయోగించాలని నిర్ణయం
* తిరుమల లోని టీటీడీ ఉద్యోగులు ఉంటే 737 కాటేజీలు మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయం
* ధన రూపంలో ఇచ్చే విరాళాలు టీటీడీ అన్ని ప్రివిలేజ్ ఇస్తుంది. ఇకపై వస్తు రూపంలో ఇచ్చే వాటికి కూడా ప్రివిలేజ్ ఇవ్వాలని నిర్ణయం
* టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాలపై నిర్ణయం
* సీఎం తిరుపతి పర్యటన, చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన, టాటా క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించనున్న సీఎం
* శ్రీనివాససేతు ప్రారంభం
* బర్డ్ ఆసుపత్రిలో స్మైల్వట్రైన్ కేంద్రం ఏర్పాటు
* తిరుమలలో స్థానికుల సమస్యలు పరిష్కారానికి పాలకమండలి నిర్ణయం
(And get your daily news straight to your inbox)
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more
May 27 | ట్రైనీ పైలట్‌కు ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని చెప్పి ఆశ చూపిన ఓ శిక్షణ పైలట్.. అమెను మెల్లిగా ముగ్గులోకి దింపాడు. వద్దు వద్దు అనుకుంటూనే అమె కూడా పైలట్ కు అనుకూలంగా మసలుకుంది.... Read more
May 27 | కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) కొత్త చీఫ్ అబు అల్ హసన్ అల్ ఖురేషీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో పోలీసులకు చిక్కాడు. వాయవ్య సిరియాలో టర్కీ ఆధిపత్య తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఉన్న ఇడ్లిబ్లోని... Read more
May 26 | స్కూలు యూనిఫాంలో ఓ దివ్యాంగ విద్యార్థిని ఒంటికాలిపై పాఠశాలకు వెళ్లే వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. అందరూ చేసేవాళ్లే కానీ.. ఆ బాలికకు కావాల్సిన అదుకునే హస్తం మాత్రం రాలేదు. కాగా, ఈ... Read more
May 26 | ఈజీ మనీవేటలో సైబర్ నేరగాళ్లు వేసే కొత్త ఎత్తులు.. ఔరా అనిపించేలా ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయినా వీళ్లు దొంగలే. దొంగలు రహస్యంగా రెక్కీ నిర్వహించి ఇంటికి కన్నాలు వేయడం, జేజులు... Read more