Irked villagers attack MLA over death of YSCRP leader గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యేపై సోంతపార్టీ కార్యకర్తల దాడి

Gopalapuram mla talari venkatrao attacked by villagers in eluru over ysrcp leader s death

G.Kothapally YSRCP president Ganji Prasad, Dwaraka tirumala local YSRCP leader Ganji Prasad, Ganji Prasad brutal murder, Gopalapuram MLA Talari Venkat Rao, G.Kothapalli, gopalapuram MLA, ysrcp MLA, YSRCP, Rajahmundry, Eluru, andhra pradesh, crime

In a key development in Andhra Pradesh's Eluru district, Gopalapuram MLA Talari Venkatrao was attacked by a large number of villagers on Saturday in relation to the brutal murder of a local YSRCP leader Ganji Prasad. Police have stated that a murder was carried out and a few accused in the case are already in police custody, however, MLA witnessed serious rebuke from locals as he had arrived to speak about the fold of events.

ITEMVIDEOS: గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యేపై సోంతపార్టీ కార్యకర్తల దాడి

Posted: 04/30/2022 11:33 AM IST
Gopalapuram mla talari venkatrao attacked by villagers in eluru over ysrcp leader s death

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం అధికార వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడి చేశారు. జి.కొత్తపల్లి గ్రామ వైసీపీ అధ్యక్షుడిగా వున్న గంజి ప్రసాద్‌ హత్యకు గురవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యేపై స్థానికులు దాడి చేశారు. ప్రజాప్రతినిధిని కాపాడటం స్వల్ప సంఖ్యలో వున్న పోలీసులు అనివార్యమైంది. గ్రామస్థులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నాయి. దాడి ఘటనలో ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలే సొంతపార్టీ ఎమ్మెల్యేపై దాడికి దిగడం కలకలం సృష్టించింది.

గత్యంతరం లేని పరిస్థితుల్లో నాలుగు గంటలుగా జి.కొత్తపల్లి పాఠశాలలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ బందీగా ఉండిపోయారు. ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గంజిప్రసాద్‌ శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో హత్యకు గురయ్యారు. దీంతో జి.కొత్తపల్లి గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వచ్చారు. హత్యకు ఎమ్మెల్యే అనుచరులే కారణమని భావించిన వందలాది గ్రామస్తులు ఆయనపై దాడి చేశారు. వందల సంఖ్యలో ఉన్న గ్రామస్తుల్ని అడ్డుకునేందుకు సరిపడినంతగా పోలీసు బలగాలు లేకపోవడంతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన గ్రామస్తులు ఖాతరు చేయకపోవడంతో ఎమ్మెల్యే షాక్‌కు గురయ్యారు. సమీపంలో ఉన్న పాఠశాల గదుల్లోకి ఎమ్మెల్యేను తరలించేందుకు పోలీసులు ప్రయత్నించినా, గ్రామస్తులు పోలీసుల్ని నెట్టుకుని ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గోపాలపురం ఎమ్మెల్యే వెంకట్రావుకు గాయలయ్యారు. జి.కొత్తపల్లి గ్రామ వైసీపీలో రెండు వర్గాల మధ్య విభేదాలే హత్యకు కారణమని భావిస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరుడి వర్గానికి, గంజిప్రసాద్ వర్గానికి గత కొంత కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గంజి ప్రసాద్‌ను ప్రత్యర్ధులు గ్రామంలో నరికి చంపారు.

గంజిప్రసాద్ వర్గీయులు తీవ్ర అగ్రహావేశాలతో పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఎమ్మెల్యేను వెంటాడి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. గన్‌మెన్లు, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.  పోలీసులు చుట్టుముట్టి ఉన్నా గ్రామస్తులు ఎమ్మెల్యేపై దాడికి దిగారు. ఎమ్మెల్యేపై గ్రామస్తులు పిడిగుద్దులు కురిపించారు. ఎమ్మెల్యేకు రక్షణగా స్థానిక పోలీసులు ఆయన్ని చుట్టుముట్టినా స్థానికులు లెక్క పెట్టలేదు. ఎమ్మెల్యే వల్లే గ్రామంలో హత్య జరిగిందని ఆరోపిస్తూ మూకుమ్మడిగా దాడి చేశారు. ఎమ్మెల్యే చొక్కా చించేసి దాడికి పాల్పడ్డారు. కేసు దర్యాప్తు కోసం వచ్చిన సిఐ, ఎస్సైలు ఎమ్మెల్యే చుట్టూ చేతులు అడ్డుపెట్టి రక్షించాల్సి వచ్చింది.

ఏలూరు నుంచి అదనపు పోలీసు బలగాలను కొత్తపల్లికి రప్పించిన తరువాత.. ఎమ్మెల్యేను సురక్షితంగా గ్రామం బయటకు తీసుకువచ్చారు. ఎమ్మెల్యే వాహనం కూడా గ్రామంలో ఉండిపోవడంతో దానిని పోలీసుల బయటకు తీసుకురావాల్సి వచ్చింది. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే రావడం వల్లే గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. అదనపు బలగాలు తరలింపు ఆలశ్యమవ్వడంతో నాలుగు  గంటలుగా ఎమ్మెల్యేను స్కూల్లోనే ఉంచారు. గ్రామస్తుల దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. జిల్లా ఎస్పీ గ్రామానికి చేరుకున్నా బలగాలు సరిపోకపోవడంతో ఎమ్మెల్యేను తరలించలేకపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles