Guntur court gives death sentence to accused in Ramya's case రమ్య హత్యకేసులో న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు

Man sentenced to death for killing b tech student among fastest verdict

Guntur District special court, CCTV camera, BTech student, Ramya's murder case, DSP Ravi Kumar, Shashi Krishna, Guntur, Andhra Pradesh, crime

Guntur district special court has passed judgment in the murder case of Ramya, a BTech student which created a sensation across the state. The court sentenced the accused Shashi Krishna to death in the case. The incident happened on August 15th, 2021 and the trial began in December after Ramya's murder followed by the verdict on Friday.

రమ్య హత్యకేసులో దోషికి ఉరిశిక్ష విధించిన గుంటూరు ప్రత్యేక కోర్టు

Posted: 04/29/2022 08:35 PM IST
Man sentenced to death for killing b tech student among fastest verdict

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో ఇవాళ గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రమ్యను దారుణంగా హత్య చేసిన కేసులో హంతకుడు శశికృష్ణకు ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. శశికృష్ణను చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. పోలీసులు అత్యంత వేగంగా దర్యాప్తు చేసి చార్జీషీటు దాఖలు చేసిన నేపథ్యంలో న్యాయస్థానం కూడా దర్యాప్తును కొనసాగించి తుది తీర్పును వెలువరించింది.

‘ఈ కేసు అరుదైన కేసుల్లో అరుదైనదిగా పరిగణించాల్సిన అవసరం ఉందని భావించాం. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు అందరూ చూస్తుండగానే హత్య చేశాడు. ఇది ఎంతో సంచలనం సృష్టించింది. ఇదంతా ఒక ఎత్తైతే... ఇంత చేసినా నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు. విచారణ జరుగుతుండగానే కోర్టులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. నిందితుడి మాటల్లో, వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు రాలేదు. తప్పు చేశాననే పశ్చాత్తాపం అతనిలో కనిపించలేదు. నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని కోర్టు భావిస్తోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని నిందితుడికి ఉరి శిక్ష విధిస్తున్నాం’ అని తీర్పు వెల్లడించిన సమయంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఏం జరిగిందంటే: సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన కుంచాల శశికృష్ణ ప్రేమ పేరుతో రమ్యని వేధించాడు. తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి 15రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. హత్య కేసులో కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి.. ఇరువర్గాల వాదనలు విని ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం.. ఈరోజు ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పు ఇచ్చింది. పోలీసులు, న్యాయవ్యవస్థకు రమ్య తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఉరిశిక్ష వేసినందుకు న్యాయం జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. ఇలా శిక్ష పడితే నేరాలు ఆగుతాయని అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles