Fake TTE held by Rajahmundry railway police రాజమండ్రి రైల్వే పోలీసుల అదుపులో నకిలీ టీటీఇ..

Fake tte held by rajahmundry railway police in alappuzha dhanbad express

Fake TTE, Gharana fraudster, Rajahmundry railway security personnel, RPF, Alappuzha-Dhanbad Express, Rajahmundry, Andhra Pradesh, Crime

The Gharana fraudster, who targeted ticketless train passengers posing as TTE, has finally been caught by Rajahmundry railway security personnel in Alappuzha-Dhanbad Express.

రాజమండ్రి రైల్వే పోలీసుల అదుపులో నకిలీ టీటీఇ..

Posted: 04/30/2022 12:46 PM IST
Fake tte held by rajahmundry railway police in alappuzha dhanbad express

రైలు ప్రయాణికుల చివరి నిమిషంలో ప్రయాణాలతో జనరల్ టికెట్లు తీసుకుని స్లీపర్ క్లాస్ లో ప్రయాణించడం.. లేక టికెట్లు కన్ఫామ్ కాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోని కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తుంటారు. అలా స్లీపర్ క్లాస్ టికెట్లు తీసుకోకుండా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను టార్గెట్ గా చేసుకుని వారి నుంచి అందినకాడికి దండుకుంటున్న ఘరానా మోసగాడు అదేనండీ నకిలీ టీటీఇ ఆటను ఎట్టకేలకు రాజమండ్రి రైల్వే భద్రతా సిబ్బందికి కట్టించారు. రాజమండ్రి టిక్కెట్ చెకింగ్ స్టాఫ్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో నిందితుడి గుట్టు రట్టైంది.

టిక్కెట్‌ లేని ప్రయాణికులను గుర్తించేందుకు ప్రతీ రైలుతో టీటీ రైల్వేశాఖ ఏర్పాటు చేసిన స్వ్కాడ్‌లో ఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, ప్రకాశరావు, సీనియర్ టిటిఇ రాజేంద్రప్రసాద్‌లు అలప్పుజా-ధన్‌బాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలా ఓ బోగీలోకి వెళ్లగానే వారికి అందులోని ప్రయాణికులు ఇప్పుడే ఓక టీటీఇ వచ్చాడుగా.. మళ్లీ వేరోకరు వచ్చారేంటి అని ప్రశ్నించారు. అయితే ఈ మాటలతో విస్మయానికి గురైన టికెట్ చెక్కింగ్ స్టాప్.. వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇలా టికెట్ చెక్కింగ్ చేస్తూ మరో బోగీలోకి ప్రవేశించగా వారికి మరో టిటిఇ తారసపడ్డాడు.

టిటిఇ యూనిఫాం వేసుకుని నకిలీ చలనా పుస్తకంతో రసీదులతో పాటు ఉన్న నకిలీ టీటీఇని చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే పలువురు ప్రయాణికుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తి అసలైన స్క్వాడ్‌ను చూసి ఖంగుతిన్నాడు. నెల్లూరుకు చెందిన వాయిలా వెంకటేశ్వర్లు రైల్వే టిటిఇగా చలామణి అవుతూ బోగీల్లో మోసాలు చేస్తుంటాడు. నిందితుడిపై గతంలో ఇదే తరహా కేసులు నమోదైనా తీరు మార్చుకోలేదు. వీటికి అదనంగా అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌గా ఓ నకిలీ ఐడి కార్డు సృష్టించుకున్నాడు. నిందితుడ్ని పట్టుకుని ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది నిలదీయడంతో అసలు గుట్టు బయటపడింది.

నిందితుడిని పట్టుకుని ద్వారపూడి రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి తీసుకొచ్చారు. దర్యాప్తు తర్వాత రాజమండ్రి రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడి వద్ద అదనపు ప్రయాణ రుసము వసూలు చేసే పుస్తకం, నకిలీ ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై విజయవాడ, చీరాల, నెల్లూరు, ఒంగోలు రైల్వే పోలీస్‌ స్టేషన్లలో ఇదే తరహా కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది ఫిర్యాదుతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. విజయవాడ రైల్వే ప్రత్యేక కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది. నకిలీ టిటిఇను పట్టుకున్న సిబ్బందిని రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles