దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. బయటకెళ్తే చాలు భానుడు భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు జనాలు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఏదైనా తప్పనిసరి పనిపై బయటకు వెళ్లి.. అరగంట నుంచి గంటలోపు ఇంటికి చేరుకున్నా.. వేడిమి దెబ్బను తట్టుకుని మామూలు స్థితికి చేరుకునేందుకు గంటల సమయం పడుతోంది. ఇక ఇలాంటి భానుడి చండ్రనిప్పుల మధ్య ఊరేగింపులో పాల్గొనాలంటే.. వామ్మో అనాల్సిందే.
కానీ ఢిల్లీలోని ఓ పెళ్లింటివారు మాత్రం భానుడు నిప్పులకొలిమిని కూడా సునాయాసంగా దాటుతూ.. తమ ఇంటి నుంచి పెళ్లి వేడుకకు బాజాభజంత్రీలతో, మేళతాళాలతో బరాత్ నిర్వహించారు. సూర్యుడి నిప్పులు కురిపిస్తున్నా.. అటపాటలతో.. సరదాగా.. ఉత్సాహాం ఎక్కడా తగ్గనీయకుండా నిర్వహించారు. అయితే భానుడి తాపానికి వీరు వేసిన ఓ ఐడియా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ పెళ్లిబృందం వినూత్న ఐడియా ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. పెళ్లి సమయంలో బరాత్ అవసరం.. కానీ ఎండను తట్టుకునేందుకు వీరు ఏర్పాటు చేసిన చలువ పందిరే ప్రత్యామ్నాయం. అయితే ఈ చలువ పందిరి స్థిరంగా ఓ చోట ఉండేది కాదండోయ్.. ఏకంగా కదిలే పందిరి.
ప్రస్తుతం ఈ కదిలే పందిరి వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజనులు ఈ విధమైన కదిలే చలువ పందిని చూసి వాహ్ వస్తాద్ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా ట్విటలర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో వరుడు గుర్రంపై ఉండగా, బంధువులు కదిలే పందిరికింద నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వారికి ఎండ తగలకుండా ఆ పందిరిని నాలుగుమూలలా నలుగురు ముందుకు జరుపుతూ కదులుతున్నారు. ఈ వీడియో చూసినవారంతా ఆశ్చర్యపోయారు. ఇండియన్స్ అంటేనే క్రియేటివిటీకి మారుపేరని నెటిజన్లు కామెంట్ చేశారు.
Sun shade and mobile secure enclosure for barat. Innovations galore pic.twitter.com/rdxUV45Qfg
— Aviator Anil Chopra (@Chopsyturvey) April 27, 2022
(And get your daily news straight to your inbox)
Jun 28 | హైదరాబాద్ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. నగరవాసులు అవసరం అయితే తప్ప తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ రాత్రి నగరవ్యాప్తంగా భారీ వర్షాలు... Read more
Jun 28 | తిరుమల శ్రీవారి భద్రతకు అత్యాధిునికంగా తీర్చిదిద్దాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుమలకు కరోనా మహమ్మారి తరువాత భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో అటు భక్తులతో పాటు శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు భద్రత... Read more
Jun 28 | మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ పరిణామాల మధ్య మహారాష్ట్రవాసులు కన్నార్పకుండా గమనిస్తున్నారు. శివసేనకు చెందిన పలువురు తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే వర్గంలో... Read more
Jun 28 | ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్తో అనుబంధం కలిగి ఉన్నవారే. నెటిజన్లు.. ఐటీ, బిజినెస్ రంగాల్లో పని చేసేవారు తమ లావాదేవీలపై నిత్యం ఈ-మెయిల్స్‌లో సమాచార మార్పిడి చేస్తుంటారు. అందుకు ఇంట్లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఒకవేళ... Read more
Jun 28 | అంతా విధి లిఖితం.. ఎవరికి ఎప్పుడు ఏమి జరగాలో.. వారికి అప్పుడు అది జరిగి తీరుతుంది. చెన్నై బ్యాంకు మేనేజర్ వాణి కారు ప్రయాణం చేస్తుండగా, కారుపై చెట్టు పడిన ఘటనలో ఈ విషయాన్ని... Read more