శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రదేశాల సరసన నిలిచిన భారత్.. గణనీయమైన పురోగతిని సాధిస్తూ మున్ముందుకు దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే భారత్ తాను సొంతంగా అభివృద్ది చేసిన శాటిలైట్ నావిగేషన్ (శాట్నావ్) టెక్నాలజీని విమానాల ల్యాండింగ్ లో విజయవంతంగా ఉపయోగించింది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా ఫసిఫిక్ దేశంగా కూడా భారత్ నిలిచింది. భారత సోంత శాటిలైట్ నావిగేషన్ శాట్నాప్ వ్యవస్థను ఉపయోగించి ల్యాండింగ్ అయిన తొలి విమానంగా ఇండిగో నిలిచింది.
రాజస్థాన్ లోని అజ్మీర్ విమానాశ్రయంలో ఈ టెక్నాలజీని ఉపయోగించి ఇండిగో విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. అమెరికా జీపీఎస్, చైనా బీడో, యూరప్ దేశాల గెలీలియో నావిగేషన్ వ్యవస్థలకు దీటుగా భారత్ గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్) పేరిట సొంత నావిగేషన్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడం తెలిసిందే. ఇస్రో ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలో మోహరించి భారత్ పటిష్టమైన నావిగేషన్ వ్యవస్థను నిర్మించింది. గగన్ ప్రత్యేకత ఏంటంటే త్రీడీ విధానంలో మార్గదర్శనం చేస్తుంది.
అజ్మీర్ ఎయిర్ పోర్టులో కూడా సదరు విమానం త్రీ డైమన్షనల్ నావిగేషన్ సపోర్టుతో సురక్షితంగా కిందికి దిగింది. పౌరవిమానయాన చరిత్రలో ఇదో కీలక ఘట్టం అని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వెల్లడించింది. ఇప్పటివరకు భారత్ లో విమానాల ల్యాండింగ్ అంతా గ్రౌండ్ కంట్రోల్ పర్యవేక్షణ ద్వారానే జరుగుతున్నాయి. ఇకపై, శాటిలైట్ టెక్నాలజీతో విమానాల ల్యాండింగ్ కార్యకలాపాలు జరుగుతాయని, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఘనత సాధించిన తొలిదేశం మనదేనని ఏఏఐ పేర్కొంది.
కాగా, శాట్నావ్ టెక్నాలజీని పరీక్షించే క్రమంలో ఏటీఆర్ విమానం ఢిల్లీ నుంచి అజ్మీర్ లోని కిషన్ గఢ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. విమానాన్ని కెప్టెన్ సందీప్ సూద్, కెప్టెన్ సతీశ్ వీరా, కెప్టెన్ శ్వేతా సింగ్ నడిపారు. వారితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ (డీజీసీఏ) ఉన్నతాధికారులు కూడా ఆ విమానంలో ప్రయాణించారు. ఈ విధానానికి డీజీసీఏ తుది అనుమతులు మంజూరు చేస్తే ఇకపై పౌర విమానాలు శాటిలైట్ నావిగేషన్ విధానంలో ల్యాండింగ్ కానున్నాయని ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more