SBI denies NOC to farmer over 31 paise ఎస్బీఐ వ్వవహారంపై మండిపడ్డ గుజరాత్ హైకోర్టు

Sbi draws gujarat high court ire for not issuing no dues certificate over 31 paise

Gujarat High Court, State Bank of India, no-dues certificate, agricultural land, Sanand, 31 paise, Borrower, Rakesh, Manoj verma, Revenue department, Farmers, mutation, pending dues 31 paise, NOC certificate, Gujarat, National Politics

The Gujarat High Court pulled up State Bank of India (SBI) for not issuing a no-dues certificate to a borrower for pending dues worth 31 paise. The petitioners in the case — Rakesh and Manoj Verma — moved the high court after buying a plot of agricultural land at Sanand from the borrower. Owing to outstanding dues by the previous owner, who had taken cash crop loans worth Rs 4.55 lakh from the SBI, the application by Rakesh and Manoj before the revenue department to mutate the land to their names, was rejected.

‘‘ఇది ముమ్మాటికీ వేధించడమే’’: ఎస్బీఐ వ్వవహారంపై మండిపడ్డ హైకోర్టు

Posted: 04/29/2022 04:22 PM IST
Sbi draws gujarat high court ire for not issuing no dues certificate over 31 paise

దాదాపుగా ఏడాది కాలం కరోనా విజృంభిస్తున్నా.. చలి, వాన, ఎండలను కూడా కాచి.. తమకు పూర్తిగా అన్యాయం చేసే నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన రైతుల పట్టదల ప్రభుత్వాలకు తెలిసివచ్చినా.. బ్యాంకింగ్ రంగ వ్యవస్థలకు మాత్రం ఇంకా తెలిసివచ్చినట్టు లేదు. ఆ కారణంగానే కేవలం 31 పైసలు బాకీ ఉన్నాడన్న నెపంతో ఓ రైతుకు బాకీ లేరన్న దృవపత్రాన్ని జారీ చేయడానికి నిరాకరించింది ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ). గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఈ ఘటన చివరికి హైకోర్టుకు చేరింది.

వివరాల్లోకి వెళ్తే.. ఖోరజ్ గ్రామానికి చెందిన శ్యాంజీ భాయ్ అనే రైతు 2020లో తన భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించాడు. అయితే, ఈ భూమి విక్రయానికి ముందు ఎస్‌బీఐ నుంచి రూ. 3 లక్షల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ రుణాన్ని చెల్లించాడు. అనంతరం ఆ భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించాడు. అయితే, కొనుగోలు చేసిన వ్యక్తుల పేర్లపై ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఎస్‌బీఐ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించినట్టు నో డ్యూ సర్టిఫికెట్ కావాలని అధికారులు చెప్పారు. దీంతో శ్యాంజీ ఎస్‌బీఐకి వెళ్లగా 31 పైసలు ఇంకా చెల్లించాల్సి ఉందని, కాబట్టి సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు.

నిన్న ఈ కేసు విచారణకు రాగా, ఎస్‌బీఐ తరపు న్యాయవాది చెప్పింది విని కోర్టు ఆశ్చర్యపోయింది. రైతు శ్యాంజీ తాను తీసుకున్న రుణంలో ఇంకా 31 పైసలు చెల్లించాల్సి ఉందని, అందుకే నో డ్యూ సర్టిఫికెట్ జారీ కాలేదని చెప్పారు. అది విన్న కోర్టు ఆశ్చర్యపోయింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం 50 పైసల కంటే తక్కువ ఉన్నదాన్ని లెక్కలోకి తీసుకోకూడదని, తీసుకున్న రుణం మొత్తాన్ని చెల్లించినా నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వలేదంటే అది వేధించడమే అవుతుందని పేర్కొంది. బ్యాంకు మేనేజర్‌ కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles