Woman thrashes Eve Teaser on Road విజయవాడ నడిరోడ్డుపై ఈవ్ టీజర్ తాట తీసిన యువతి

Woman teaches a good lesson to eve teaser on road in vijayawada

Gannavaram airport employee thrashes eve teaser, Airport Employee Eve teaser, Gannavaram air port employee obstructed by eve teaser, Eve teaser misbehavior with airport employee, airport employee thrashed eve teaser with stick, Air port employee eve teaser Vijayawada, Airport Employee, Gannavaram, Eve teaser, misbehavior, Stick, thrash, Road, Vijayawada, Andhra Pradesh, viral video, Crime

Irked after an eve-teasers behaviour a woman attacked the person with a stick on the road and handed him over to the police. According to the reports, an eve-teaser misbehaved with a woman employee who is working in the airport and was irked after his behaviour she attacked him with a stick after tying him to a tree.

ITEMVIDEOS: విజయవాడ నడిరోడ్డుపై ఈవ్ టీజర్ తాట తీసిన యువతి

Posted: 04/29/2022 03:30 PM IST
Woman teaches a good lesson to eve teaser on road in vijayawada

యువతులు పోద్దుపోయిన తరువాత వీధుల్లో కనబడితే చాలు పోకిరీల బెడద అధికం అవుతోంది. కృష్ణాజిల్లాలో ఈతరహా అడగాలు మరీ అధికమయ్యాయి, ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కూతవేటు దూరంలో కృష్ణానది ఇసుక తెన్నరల వద్ద.. సాయంకాల సమయంలో అటుగా వెళ్లిన కాబోయే వధూవరులపై దాడి చేసిన అగంతకులు యువకుడిని చితకబాది.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషాదఘటన తాలుకు ఛాయలు ఇంకా కళ్లముందు కదులుతూనే వున్నాయి. ఇలాంటి ఘటనల నేపథ్యంలో యువతులు అత్యంత అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది.

మరీ ముఖ్యంగా రాత్రి వేళలో విధులు ముగించుకుని ఇళ్లకు తిరిగివెళ్తున్నవారు లేదా.. రాత్రి విధులకు హజరయ్యేందుకు వెళ్తున్న యువతులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అడుగుడుగునా ఆగంతకులు పోంచివున్నారు. అందుకు ఉదాహరణ ఈ పోకిరియే. రాత్రి వేళ గన్నవరం విమానాశ్రయం ఎయిర్ పోర్టులో విధులు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్న ఓ యువ‌తిని.. ఓ పోకిరి ఫాలో అవుతూ ఇబ్బంది పెట్టాడు. అయితే అప్పటికే ఓ పర్యాయం అమె వాహనాన్ని అటకాయించగా అమె తన మామయ్యకు ఫోన్ చేసింది. అయినా అమెను వెంబడించి ఇబ్బంది పెట్టడంతో న‌డిరోడ్డుపైనే ఆ పోకిరి తాట తీసి బుద్ది చెప్పింది.

పోకిరీని క‌ర్ర‌తో చిత‌గ్గొట్టి పోలీసులకు అప్పగించింది. గన్నవరం నుంచి వెంబడించిన పోకిరిని విజయవాడ శివారల్లోకి వచ్చిన తరువాత మరోమారు యువతిని అటకాయించే ప్రయత్నం చేశాడు పోకిరి. దీంతో ధైర్యం కూడగట్టుకున్న యువతి.. ఈ సమస్యను ఇవాళే తేల్చుకుందామని నిర్ణయానికి వచ్చింది. లేకపోతే ప్రతీ రోజు అమె ఈ అకతాయిని భరించాల్సి వస్తుందని తన వాహనాన్ని నిలిపి అక్కడి ఓ చెట్టు కొమ్మను కోసి దాంతో పోకిరి చావచితక బాది తాట తీసింది. అయితే యువతి ఈఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాల‌కు సంబంధించిన‌ వీడియోను ఒక‌రు స్మార్ట్ ఫోనులో చిత్రీక‌రించారు. ఈ వీడియోను ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, ఆ యువ‌తిని ప్ర‌శంసించారు.

గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా ఓ పోకిరి బైకును అడ్డగించి వేధింపులకు గురిచేశాడని ఆమె అందులో వివ‌రించారు. సదరు పోకిరిని యువ‌తి కర్రతో చితకబాదిందని చెప్పారు. ఆ యువ‌తి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. కాగా, వేధింపుల‌కు గురిచేసిన ఆ యువ‌కుడిని కింద ప‌డేసి ఆ యువ‌తి క‌ర్ర‌తో కొడుతుండ‌గా ఆ పోకిరీ భ‌యంతో వణికిపోయాడు. పోకిరీలు ఇలా వేధింపులకు గురి చేస్తోంటే ఆడ‌వాళ్లు బ‌య‌ట ఎలా తిర‌గ‌గ‌లుతార‌ని ప్ర‌శ్నిస్తూ యువ‌తి అంద‌రి ముందూ ఆ యువ‌కుడిని చిత‌క‌బాదింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Airport Employee  Gannavaram  Eve teaser  misbehavior  Stick  thrash  Road  Vijayawada  Andhra Pradesh  viral video  Crime  

Other Articles