Symptoms Of New Covid Variant XE కరోనా వైరస్: ఒమిక్రాన్ 'ఎక్స్ఈ'​ వేరియంట్ లక్షణాలు ఇవే..

Xe variant of covid 19 in india what are the symptoms of new mutation

XE variant of Covid-19 in India,XE variant,XE variant symptoms,symptoms of XE,symptoms of omicron XE, COVID-19 R-Value Delhi, COVID-19 Delhi, IIT Madras Analysis, Delhi s R Value Covid, Delhi Coronavirus Cases, Coronavirus Cases in Delhi, Delhi pollution, Delhi covid cases, Delhi Covid curbs, COVID XE variant, Omicron XE Coronavirus, XE Coronavirus Varriant, Delhi covid 19 news, XE Coronavirus Variant news, Delhi temperature, delhi weather forecast, delhi news updates

The symptoms can be mild for some and they can be severe for others. The newest variant spreads rapidly. Depending on one's vaccination status and immunity acquired from earlier infections, symptoms and severity of the Covid-19 virus depend from person to person. Some of the symptoms to watch out for include fever, sore throat, scratchy throat, cough and cold, skin irritation and discolouration, gastrointestinal distress, etc.

కరోనా వైరస్: ఒమిక్రాన్ 'ఎక్స్ఈ'​ వేరియంట్ లక్షణాలు ఇవే.. గుర్తిస్తే పరీక్షించుకోండి..

Posted: 04/26/2022 04:02 PM IST
Xe variant of covid 19 in india what are the symptoms of new mutation

కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా కొత్త వేరియంట్లుగా పరివర్తన చెంది ప్రపంచదేశాలపై దాడి చేస్తూనే వుంది. యావత్ ప్రపంచ మానవాళిపై తీవ్రప్రభావం చూపిన.. ఈ మహమ్మారి తాను పురుడు పోసుకున్న చైనాలోనూ ఇప్పడు మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్ లోని పరివర్తన్ చెందిన వేరియంట్ కొవిడ్ 19 ఎక్స్​ఈ విజృంభిస్తోంది. పారిశ్రామిక నగరాలతో పాటు వాణిజ్య నగరాలు కూడా లాక్ డౌన్ కొనసాగిస్తున్నా అక్కడ మరణాలు అగడం లేదు. ఇక ఈ ఎక్స్ఈ వేరియంట్ మనదేశంలోనూ గుజరాత్ లో నమోదైన విషయం తెలిసిందే.

అయితే అప్పటివరకు మనకు ఈ కొత్త వేరియంట్​ లక్షణాలు ఏమిటో తెలియదు. చాలావరకు ఎక్స్ఈ వేరియంట్ కేసుల్లో లక్షణాలు లేవని చైనా వైద్యాధికారులు తెలిపారు. కాగా మన వైద్య నిపుణలు దీనిపై అధ్యయనం చేసి.. ఈ వేరియంట్ లక్షణాలను, వాటి తీవ్రతను తెలుసుకున్నారు. పెద్దగా అందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ వైపు నిపుణులు చెబుతున్నా.. లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పక పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. చాపకింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరంలో ఆకస్మికంగా మార్పులు చోటు చేసుకుంటే.. కచ్చితంగా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే అంటున్నారు. ఆ లక్షణాలేంటో తెలుసుకుని మీరు జాగ్రత్తగా ఉండండి.

చర్మం చికాకు: ఇటీవల మీ చర్మంపై ఏదైనా దద్దుర్లు లేదా రంగు మారడాన్ని గమనించారా? అయితే మీరు కొవిడ్-19 ఎక్స్​ఈ వేరియంట్ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందనడానికి సంకేతం కావచ్చు. కొన్ని సందర్భాల్లో స్కిన్ ఇరిటేషన్, ముఖ్యంగా మంట దీనికి సంకేతాలు కావొచ్చు.

కడుపు సమస్యలు: మీ గట్ అకస్మాత్తుగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు మీకు అనిపిస్తుందా? మీరు ఎసిడిటీ, మలబద్ధకం, విరేచనాలతో బాధపడుతున్నారా? మీరు మంచి ఆహారం తీసుకున్నా ఈ సమస్య వచ్చిందంటే.. మీ బాధకు వెంటనే పరిష్కారం కనుగొనలేకపోతే.. అది కొవిడ్ ఎక్స్​ఈకి సంకేతమే కావొచ్చు. ఈ భయంకరమైన వైరస్ సంకేతాలలో జీర్ణశయాంతర బాధ కూడా ఒకటి.

శ్వాస సమస్యలు: కొవిడ్-19 మునుపటి వేరియంట్‌లలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొనేలా చేసింది. ఈ ఎక్స్​ఈ వేరియంట్​లలో కూడా శ్వాస ఇబ్బందులను కలిగిస్తుంది. కాబట్టి అకస్మాత్తుగా మీ శ్వాస విధానం మారినా.. కొంచెం దూరం నడిచి వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నా.. వెంటనే మీరు కరోనా-19 పరీక్ష చేయించుకోండి.

జ్వరం: జ్వరం అనేది మన శరీరంపై దాడి చేసే వైరస్ నుంచి మనల్ని రక్షించే సమయంలో వస్తుంది. మీకు జ్వరం వచ్చినట్లయితే, ప్రత్యేకించి అది మరీ ఎక్కువగా లేకుంటే.. కరోనా టెస్ట్ చేయించుకోండి. దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కదా.

గొంతు నొప్పి: మీ శ్వాసకోశ ఇబ్బందులు కరోనా వైరస్​ ద్వారా ప్రభావితమవుతాయి. దీని కారణంగా మీ గొంతులో నొప్పి, దురద, కఫం కూడా అనుభవించవచ్చు. మీకు ఇలాంటి ఇబ్బందులే ఎదురైతే.. వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles