woman held for cheating youths by promising jobs నిరుద్యోగులకు రూ. లక్షల కుచ్చుటోపి.. పోలీసులకు చిక్కిన కిలాడీ.!

Woman promising jobs to youth booked for cheating

woman cheats unemployed youth, woman betrays unemployed youth, woman pose as SI, woman cheats millions of ruppes, women promising SI jobs, woman promising secretariat jobs, woman, Sub Inspector, cheating, jobs, umemployed, SI Jobs, Secretariat jobs, absconding. Husnabad, Telangana police, Crime

A woman who posed as an Sub Inspector was arrested by the Telangana police recently for cheating unemployed youth, after robbing millions of ruppees promising jobs in police department and Secretariat. The accused, who escaped since few years using technology, was finally caught in Husnabad.

నిరుద్యోగులకు రూ. లక్షల కుచ్చుటోపి.. పోలీసులకు చిక్కిన కిలాడీ.!

Posted: 04/26/2022 05:15 PM IST
Woman promising jobs to youth booked for cheating

తనను తాను పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ గా చెప్పుకున్న ఓ మహిళ.. నిరుద్యోగులే లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయల మేర కుచ్చుటోపి పెట్టింది. కొన్నాళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న మహిళను ఎట్టకేలకు తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు అమె ఆటకట్టించారు. సాంకేతికతను ఉపయోగించుకుని ఇన్నాళ్లూ తప్పించుకున్న నిందితురాలు ఎట్టకేలకు హుస్నాబాద్‌లో పట్టుబడింది. పోలీసులు అమె భర్తను విచారించి అమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటీవలే పెళ్లైన ఈ నిందితురాలికి ప్రస్తుతం నాలుగు నెలల చిన్నారి ఉండటం గమనార్హం.

పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటకు చెందిన ఓ యువకుడు పోలీసు ఉద్యోగం కోసం ఆశపడి ఎస్సైగా పరిచయమైన మహిళను గుడ్డిగా నమ్మి రూ. 10 లక్షలు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఆమె పత్తా లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నాలుగు రోజుల క్రితం మాయ ‘లేడీ’కి అరదండాలు వేశారు. విచారణలో ఆమె వెల్లడించిన విషయాలు పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. సిద్దిపేట, ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఎంతోమంది యువకులను మోసం చేసినట్టు వెల్లడించింది.

నిందితురాలి పేరు విజయభారతి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామం. డిగ్రీ పూర్తి చేసి 2018లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో నిర్వహించిన శిబిరంలో పాల్గొన్నప్పటికీ ఎంపిక కాలేదు. మహబూబాబాద్‌కు చెందిన ఓ యువకుడిని ప్రేమించి మోసపోయింది. అప్పులు తెచ్చి మరీ అతడికి రూ.  13 లక్షలు ఇచ్చింది. అతడి చేతిలో మోసపోయిన తర్వాత అప్పులు తీర్చేందుకు ఎస్సై అవతారం ఎత్తింది. ఎస్సై పరీక్షలకు సంబంధించి నకిలీ పత్రాలు, ధ్రువపత్రాలు తయారుచేసింది. అంతేకాదు, ఎస్సైగా ఎంపికైనట్టు నమ్మించి ప్రముఖుల నుంచి సన్మానాలు కూడా చేయించుకుంది. ఆ ఫొటోలను చూపించి పోలీసు శాఖలో, సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసాలు చేయడం ప్రారంభించింది.

నారాయణరావుపేట యువకుడి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసిన విజయభారతి..  అతడి ద్వారా మల్లన్న సాగర్‌ ముంపు బాధితుల నుంచి బాండ్ పేపర్ రాయించుకుని లక్షలు తీసుకుంది. ఎస్సైగా నమ్మించి వరంగల్‌కు చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. వీరికిప్పుడు నాలుగు నెలల చిన్నారి ఉన్నాడు. ఆమె కోసం గాలించిన పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంది. టవర్ లొకేషన్ తెలియకుండా జాగ్రత్త పడింది. దీంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని అతడి ద్వారా ఫోన్ చేయించారు. చివరికి హుస్నాబాద్‌లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles