UP bride slaps groom during varmala ceremony వరుడి మద్యం మత్తును వధువు చిత్తు చేసిందిలా..

Viral video bride slaps groom during wedding ceremony in uttar pradesh s hamirpur

bride slaps groom, bride viral video, bride uttar pradesh, groom slapped during wedding, groom slapped during varamala ceremony, bride, groom, slap, drunk, Wedding, Varamala ceremony, baraat, Swasa village, Hamirpur, Chamari village, Jalaun district, Uttar Pradesh, viral video

A video that has gone viral on social media is from Uttar Pradesh’s Hamirpur where a bride slapped the groom during the varamala ceremony, following which she walked off the stage. The baraat had arrived at Hamirpur from Jalaun district’s Chamari village. The groom was identified as Ravikanth.

ITEMVIDEOS: వరుడి మద్యం మత్తును వధువు చిత్తు చేసిందిలా..

Posted: 04/19/2022 05:08 PM IST
Viral video bride slaps groom during wedding ceremony in uttar pradesh s hamirpur

ప్రతీరోజు సోషల్‌ మీడియా వేదికగా ఎన్నో ఫన్నీ వీడియోలు చూస్తుంటాం. అందులో పెళ్లికి సంబంధించిన కపుల్స్‌ ఫన్నీ వీడియోలు చాలానే చూసి ఉంటారు. ఎందకంటే పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగిన గొప్ప వేడుక. ఇందుకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను పెళ్లి చేసుకోబోయే జంట పధిళంగా దాచుకుంటారు. అందకనే తమ పెళ్లిని కొత్తగా. అలోచింపజేసేలా చేసుకుంటుంటారు. అయితే ఈ మధ్య ఉత్తర భారతదేశంలో పెళ్లిళ్లలో అనుకోని ఘటనలు చోటుచేసుకోవడం మనం చాలనే చూస్తున్నాం. ఓ పెళ్లిలో సరిగ్గా వధూవరులు వరమాల వేసుకునే సమయంలో వధువు ప్రియుడు వచ్చి.. పాత చిత్రాలలోని డైలాగులను చెప్పి.. పెళ్లి పెద్దలతో పాటు అహుతులను కూడా విస్మయానికి గురిచేసిన ఘటన తెలిసిందే.

ఇక తాజాగా సోషల్‌ మీడియాలో మరో వీడియో వైరల్‌గా మారింది. కాసేపట్లో పెళ్లి జరగబోతోందని అందరూ ఎంతో సంతోషంగా ఉండగా.. వరుడికి వధువు షాకిస్తూ అందరి ముందే చెంపచెళ్లుమనిపించింది. దీంతో వరుడికి దిమ్మతిరింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగిన వివాహ వేడుకలో వధువు... వరుడి చెంప చెళ్లుమనిపించింది. పెళ్లి మండపంలో వరువు.. వధువు మెడలో పూల దండ వేవబోతుండగా.. ఆమె ఒక్కసారిగా పెళ్లికొడుకు చెంపపై కొట్టింది. ఏదో ఒక్కసారి కొట్టడం కాదు ఏకంగా మూడు, నాలుగు సార్లు చెంపవాయిస్తూనే ఉంది.

దీంతో అక్కడున్నా వారంతా షాకయ్యారు. ఇలా చేసిన వధువు ఛీ నీ ముఖం నేను చూడను అన్నట్లు వరుడ్ని అక్కడే వదిలేసి.. అమె మాత్రం పెళ్లి మండపం దిగి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వధువుపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పెళ్లిలో వరుడు మద్యం సేవించి ఉండటం వల్లే ఆమె ఇలా చేసిందని ట‍్విట్టర్‌ యూజర్‌ తెలుపాడు. అదే నిజమైతే వరుడి తలకు ఎక్కిన మత్తును వధువు నాలుగు రౌండ్లు దించేశాయని నెటిజనులు ఫన్ని కామెంట్లు పెడుతున్నారు. ఇక వధువుకు ఈ పెళ్లి ఇష్టంలేకనే అలా చేసిందని ఆమె బంధువులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles