7 held for making Dalit boy lick feet in UP యూపీలో దళిత బాలుడిపై దౌర్జన్యం..

Uttar pradesh dalit boy forced to lick feet 8 held as video goes viral

Uttar Pradesh, Uttar Pradesh forward caste Crime, Dalit boy lick feet in Uttar Pradesh, Crime against Dalits, Lucknow, Ramlila Maidan, Kotwali police station, Dalmau Circle Officer, Dalit student, Ashok Singh, Rae Bareli, Uttar Pradesh, Crime

In a shocking incident, a Class 10 boy belonging to the Scheduled Castes (SC) was assaulted and forced to lick the feet of a person allegedly from an upper caste in Rae Bareli district of central UP recently. The incident, which took place on April 10, came to light when a video of the assault went viral on social media. Taking action in the case on the basis of the complaint submitted by the victim, the district police arrested seven people.

యూపీలో దళిత బాలుడిపై దౌర్జన్యం.. గంజాయి విక్రయమంటూ కల్పిత అరోపణలు

Posted: 04/19/2022 11:00 PM IST
Uttar pradesh dalit boy forced to lick feet 8 held as video goes viral

ద‌ళిత బాలుడిని కొంద‌రు యువ‌కులు దారుణంగా కొట్టారు. అంతేగాక‌, ఆ బాలుడితో తమ కాళ్లు నాకించుకుని పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను స్మార్ట్ ఫోన్ల‌లో చిత్రీక‌రించారు. ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మైన‌ర్ పై దాడి జ‌రిగిన‌ ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాయ్ బ‌రేలీలో జరిగింది. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న దళిత బాలుడిపై తమ జుళం చెలాయించారు అగ్రవర్ణాలకు చెందిన యువకులు. ఈ ఆకృత్యానికి తెగబడిన ఓ యువకుడి పోలాల్లో బాధిత బాలుడి త‌ల్లి కూలీగా ప‌నిచేస్తోంది.

అయితే తల్లి చెప్పడంతో వారి వద్దకు వెళ్లిన బాలుడు త‌న‌ త‌ల్లి ప‌నికి సంబంధించిన డ‌బ్బులు ఇవ్వాలని అడగడంతో అగ్రవర్ణాల యువకులు అత‌డిపై దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఆ బాలుడిని మొద‌ట బెల్టుతో కొట్టారు. ఆ త‌ర్వాత కూడా వ‌దిలిపెట్ట‌కుండా కాళ్లు నాకాల‌ని నిందితులు డిమాండ్ చేశారు. ఆ బాలుడు ఏడుస్తూ, త‌న‌ను విడిచిపెట్టాల‌ని కోరినా వినిపించుకోలేదు. ఆ స‌మ‌యంలో భ‌యప‌డిపోతోన్న ఆ ద‌ళిత బాలుడిని చూస్తూ అక్క‌డ ఉన్న ఇత‌రులు గ‌ట్టిగా న‌వ్వారు. ఇటువంటి త‌ప్పు మ‌రోసారి చేస్తావా? అని ఆ ద‌ళిత బాలుడిని ఆ యువ‌కులు ప్ర‌శ్నించారు. చేయ‌బోన‌ని ఆ బాలుడు క‌న్నీరు పెట్టుకున్నాడు.

ఆ ద‌ళిత బాలుడు స్థానికంగా గంజాయి అమ్ముతున్న‌ట్లు అక్క‌డి యువ‌కులు కొంద‌రు ఆరోప‌ణ‌లు చేశారు. వాళ్లు కొట్టే దెబ్బ‌లు తాళ‌లేక ఆ ఆరోప‌ణ‌ల‌ను భ‌యంతోనే ఆ ద‌ళిత బాలుడు అంగీక‌రించాడు. ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డంతో దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ నెల‌ 10వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగిందని తెలిపారు. ద‌ళిత బాలుడు త‌మ‌కు లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేశాడ‌ని, అనంత‌రం వెంట‌నే నిందితుల‌ను అరెస్టు చేశామ‌ని పోలీసులు చెప్పారు. ద‌ళిత బాలుడిపై ఇటువంటి దారుణానికి పాల్ప‌డ్డ‌ వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని ప‌లు సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles