Anand Mahindra welcomes back his Team with a Warm tweet ‘‘వెల్ కమ్ బ్యాక్ టీమ్..’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్..

Anand mahindra welcomes back his team with a warm tweet

Anand Mahindra, Twitter, Mahindra Rise, Tech Mahindra, Warm and personal Hello, screens no substitues, Tech Mahindra Employees, Tech Mahindra staff, Welcome back Tweet, Anand Mahindra tweet

Anand Mahindra's tweets have always got us hooked. The industrialist is quite an inspiration for his followers. He often posts motivational and interesting videos, photos and comments on social media. Recently, the top Businessman had made a tweet greeting a welcome back to tech mahindra employees and staff to office with a warm and heart touching post.

‘‘వెల్ కమ్ బ్యాక్ టీమ్..’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్..

Posted: 04/14/2022 06:53 PM IST
Anand mahindra welcomes back his team with a warm tweet

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని మానవాళిపై ఎనలేని ప్రభావం చూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా లక్షలాధి మంది అసువులు బాయగా, అనధికారికంగా కోటికి పైగానే ప్రజల ప్రాణాలను కరోనా బలితీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సాప్ట్ వేర్ ఉద్యోగులకు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ (ఇంటి నుంచి పనిచేసే వెసలుబాటును) కల్పించింది. మొదట కొన్ని రోజులు మాత్రమే అనుకున్న ఈ పద్దతి తరువాత కొన్ని నెలలకు చేరింది. ఏకంగా రెండు సంవత్సరాలుగా కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో కోవిడ్ ప్రభావం నామమాత్రంగా కూడా ప్రభావం చూపించడం లేదని తేలియడంతో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగులను తిరిగి తమ కార్యాలయాలకు వచ్చి విదులు నిర్వహించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి. తాజాగా టెక్‌ మహీంద్రా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి కార్యాలయాలకు వస్తున్న ఉద్యోగులకు ఘనంగా స్వాగతం పలుకుతోంది.అందుకు సంబంధించిన వీడియోను మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా వీడియోల్ని షేర్‌ చేశారు. కరోనా కష్టకాలంలో అన్నీరంగాలు కుదేలైతే..ఐటీ రంగం మాత్రం అపరిమిత లాభాలు సాధించింది.

దీని కారణం ఐటీ కంపెనీలు అమలు చేసిన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానమే. ఈ పద్దతిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐటీ కార్యకలాపాలు కొనసాగాయి. కానీ ఇప్పుడు కరోనా తగ్గు ముఖం పట్టడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలుపునిస్తున్నాయి. ఈ నేపథ్యంలో "ఇన్ని రోజులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్న ఉద్యోగుల్ని కార్యాలయాలకు చాలా ఎగ్జైట్‌మెంట్‌తో స్వాగతిస్తున్నాం. మహీంద్రా సంస్థలోని మా సహోద్యోగులు మళ్లీ తిరిగి కార్యాలయాలకు వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారంటూ" ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles