Teacher saves choking student with Heimlich maneuver విద్యార్థి గొంతులో వాటర్ బాటిల్ క్యాప్.. టీచర్ ఏం చేసిందంటే..!

Watch water bottle explodes causing child to choke teacher saves his life

Janeice Jenkins,, Teacher, third graders, East Orange Community Charter School, water bottle cap, Heimlich manoeuvre, New Jersey, Teachers, Choking, Students, Elementary Schools, United States, America

A school teacher in New Jersey, US, saved the life of a child with her quick thinking. Janeice Jenkins, who was looking after her class of third graders at East Orange Community Charter School, suddenly realised that one of her students had started choking on a water bottle cap. She immediately performed the Heimlich manoeuvre on the boy to clear his airway.

ITEMVIDEOS: విద్యార్థి గొంతులో వాటర్ బాటిల్ క్యాప్.. టీచర్ ఏం చేసిందంటే..!

Posted: 04/14/2022 05:54 PM IST
Watch water bottle explodes causing child to choke teacher saves his life

అగ్రరాజ్యం అమెరికాలో ఓ టీచర్ హీరోగా నిలిచారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్లకు ప్రథమ చికిత్సలపై కూడా అవగాహన ఉండాలని.. ఈ ఉపాధ్యాయురాలు నిరూపించారు. ఎలా అంటే.. తన తరగతి గదిలోని ఓ మూడవ తరగతి విద్యార్థి వాటర్ బాటిల్ మూతను మింగేసాడు. అది కాస్తా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో టీచర్ దానిని హిమ్లీచ్ మాన్యువీర్ పద్దతిని అవలంభించి చాకచక్యంగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

అసలేం జరింగిందంటే.. అమెరికాలోని న్యూ జెర్సీలోని ఈస్ట్ ఆరెంజ్ కమ్యూనిటీ చార్టర్ పాఠశాలలో రాబర్ట్ స్టోనేకర్ అనే తొమ్మిదేళ్ల చిన్నారి మూడవ తరగతి చదువుతున్నాడు. అయితే మధ్యాహ్నం వేళ పాఠశాల కొనసాగుతుండగా, తనకు దాహం వేసింది. వెంటనే తన వాటర్ బాటిల్ ను తీసే ప్రయత్నం చేశాడు. అయితే అది టైట్ గా ఉండటం కారణంగా తెరుచుకోలేదు. దీంతో వెంటనే తన నోటిలోని పళ్లతో మూతను పట్టుకుని బాటిల్ ను తప్పిడం ప్రారంభించాడు. మూత తెరుచుకుంది. వెంటనే నీళ్లను తన నోట్లో పోసుకున్నాడు. అయితే అప్పటికే తన నోట్లో ఉన్న మూతను కూడా మింగేసాడు.

దీంతో అదికాస్తా తన గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో విద్యార్థి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అయితే వెంటనే తరగతి గదిలోని సింక్ వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న టీచర్ జానీస్ జెంకిన్స్ కు విషయం చెప్పాడు. అంతే వెంటనే అమె విద్యార్థిని పోత్తికడుపులో పట్టుకుని హిమ్లీచ్ మాన్యువీర్ పద్దతిని అవలంభించింది. అంతే మూత బయటకు వచ్చింది. ఈ పద్దతి ద్వారా మనిషి కడుపులో ఒత్తి పట్టుకుని జట్కాలు ఇస్తే గొంతులో ఇర్కుకున్న వస్తువులు బయటకు వస్తాయి. అయితే ఈ పద్దతి తెలిసిన టీచర్ వెంటనే విద్యార్థిపై ప్రయోగించి.. అతడ్ని కాపాడింది.

ఈ సందర్బంగా టీచర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారి సురక్షితంగా ఉన్న తరువాత అతడ్ని నర్సు వద్దకు తీసుకెళ్లి.. విద్యార్థి నూరు శాతం మెరుగైన అనుభూతిని పోందగలుతున్నాడా అన్ని విసయమై అలోచించారు. చిన్నారి తన వద్దకు రాగానే అప్పుడేమి జరిగిందో అలోచించినప్పుడు.. ఏం జరుగుతుందోనన్న అందోళన చెందకుండా.. తనకు తెలిసిన పద్దతిలో పరిష్కరించే ప్రయత్నం చేశానని అన్నారు. తరగతి గదిలో ఎలాంటి ఘటనలు జరగనీయకుండా చేసిన దేవుడికి అమె తన ధన్యవాదాలు తెలిపారు. అయితే విద్యార్థి మాత్రం ఇకపై తాను ఎప్పుడు నోటితో వాటర్ బాటిల్ ఓపెన్ చేయనని అన్నాడు.

 
 
 
View this post on Instagram

A post shared by Good News Movement (@goodnews_movement)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles