Huge Sturgeon fish spotted in North American river నార్త్ అమెరికా నదిలో డైనాసర్ చేప.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం

Video of monster sturgeon fish lurking in a river is leaving netizens in awe

living dinosaur, Monster Sturgeon Fish, sturgeon fish, North America, fresh water monster fish, Sturgeon, Triassic period, Video Viral, North American River, Netizens, Twitter, Social media, viral video

A recent video of a 100-year-old Sturgeon fish, also known as the ‘living dinosaur’, swimming in a North American river has gone viral. The biggest freshwater fish Sturgeons first appeared in the fossil record in the Triassic period and have not undergone any significant changes since.

ITEMVIDEOS: నార్త్ అమెరికా నదిలో డైనాసర్ చేప.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం

Posted: 04/14/2022 08:01 PM IST
Video of monster sturgeon fish lurking in a river is leaving netizens in awe

సృష్టిలో మనకు తెలియని ఎన్నో వింత జీవులు నివసిస్తున్నాయి. ఎన్నిరకాల జీవరాశులు జీవిస్తున్నాయో మనకు తెలియనే తెలియదు. కోట్లాది జీవరాశులు ఉన్నాయంటే మనం ఔనా అనుకుంటా తప్ప.. ఆ దిశగా ఎప్పుడూ అలోచించం. కానీ అప్పుడప్పుడు రకాల జీవాలను చూసినపుడు ఔరా అని ఆశ్చర‍్యపోతుంటాం. మొన్నామధ్య ఓ పడవలో వెళ్తున్న వ్యక్తికి తనను వెంటాడుతూ వచ్చిన ఓ జంతువు కనిపించింది. అది నేరుగా తన పడవ వరకు వచ్చి తిరిగి వెళ్లిపోయింది. ఆ తరువాత కానీ నీటి శునకం అని తెలియలేదు. అలాగే  కొన్ని జీవరాశులను చూసినప్పుడు మాత్రమే మనకు వాటి గురించి తెలుస్తుంది.

యూనిమేషన్‌ సినిమాలు, హాలీవుడ్‌, కార్టూన్‌ ఛానెళ్లలో వింత జంతువులను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంటాం. అలాంటి జంతువులు నిజంగానే ఉన్నాయా అని అనుకుంటాం కదా.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నార్త్‌ అమెరికాలో వెలుగు చూసింది. సాధారణంగా మనం 50-100 కిలోల బరువున్న చేపలను చూసి ఉంటాం. కానీ, 10 అడుగులకు పైగా పొడువు, దాదాపు 500 పౌండ్ల నుంచి 600 పౌండ్ల బరువున్న చేపను చూశారా..? ఇంత సైజు, బరువు ఉన్న ఓ చేప( స్టర్జన్ ఫిష్‌) ఫ్రేజర్‌ నదిలో కనిపించింది.

భయకరంగా ఉన్న ఆకృతిని చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ స్టర్జన్‌ ఫిష్‌ వయసు ఒక శతాబ్దం కంటే ఎక్కువ  కాలమే ఉంటుందని అంచనా. స్టర్జన్‌ చేపలు జురాసిక్‌ యుగం నుంచి ఉంటున్నాయని, ఇవి బతికున్న డైనోసార్స్‌ అని నిపుణులు చెబుతుండటం విశేషం. అయితే ఇవి మనుషులకు ఎలాంటి హానీ తలపట్టవని.. అందుకు కారణం వీటికి అసలు పళ్లు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles