Angry Dolphin Attacks Trainer During Show At Miami Seaquarium ట్రైనింగ్ ఇస్తూండగా.. శిక్షకుడిపైనే దాడి చేసిన డాల్ఫిన్..

Chilling video dolphin attacks florida trainer during show at miami seaquarium

Dolphin attack, trained dolphin, female trainer, Miami Seaquarium, apparent injury, aquarium's Dolphin Flipper Show, audience member, Shannon Carpenter, Miami-Dade, Fire Rescue, dolphin vs trainer, TikTok, Social media, viral video

A trained dolphin attacked a female trainer at the Miami Seaquarium on Saturday, leading to an apparent injury and a viral video that captured the unexpected sequence during the aquarium's Dolphin Flipper Show.

ITEMVIDEOS: ట్రైనింగ్ ఇస్తూండగా.. శిక్షకుడిపైనే దాడి చేసిన డాల్ఫిన్..

Posted: 04/14/2022 12:47 PM IST
Chilling video dolphin attacks florida trainer during show at miami seaquarium

డాల్ఫిన్లు మనుషులతో త్వరగా కలుస్తాయి. మనుషులను త్వరగా అన్వయించుకుంటాయి. వారు ఎలా చేస్తే అలా చేయాలని ప్రయత్నిస్తుంటాయి. ఇక వాటికి చక్కగా ట్రైనింగ్ ఇస్తే.. ఇంకా బహుచక్కగా మనుషుల మాదిరిగా ప్రవర్తించేందుకు దోహదపడతాయి. అందుకనే వీటిని పలు దేశాల్లో ఆకర్షణీయ ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. అయితే తొలిసారి ఓ డాల్పిన్ కు పట్టరాని కోపం వచ్చింది. అంతే అది నీటిలోనే తన ట్రైనర్ పై తిరగబడింది. ఇది గమనించిన ట్రైనర్ నీటిలోంచి బయటకు రాగా.. డాల్పిన్ వెంటనే దాడి చేసింది. దీంతో ఆ ట్రైనర్‌తోపాటు ప్రదర్శన చూస్తున్న వారంతా షాకయ్యారు. అమెరికాలోని మయామి సీక్వేరియంలో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ డాల్పిన్ ప్రేమికులను విస్మయానికి గురిచేసింది.

అదేంటి డాల్పిన్లు మనుషులపై దాడి చేశాయా.? అంటూ విస్తుపోయారు. డాల్ఫిన్‌ షోను చాలా మంది సందర్శకులు, మరీ ముఖ్యంగా చిన్నారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రదర్శనల సందర్భంగా అవి అడే ఆటలను చూస్తూ.. మైమర్చిపోతారు చిన్నారులు. కానీ అలాంటి డాల్ఫిన్‌ ఉన్నట్టుండి కోపంతో శిక్షకురాలిపై దాడి చేసిందన్న వార్తను మాత్రం నమ్మశక్యంగా లేదని అంటున్నారు. ఈత కొలనులో ఈదుతున్న శిక్షకురాలి మీదకు పలుమార్లు డాల్పిన్ దూసుకువచ్చింది. దీంతో ఆ ట్రైనర్‌ పూల్‌ ఒడ్డుకు వేగంగా చేరింది. దీంతో డాల్పిన్ కూడా నీటిలోంచి నేరుగా ట్రైనర్ కాలిపై దూసుకువచ్చి దాడి చేసింది. వెంటనే ఆ మహిళా ట్రైనర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆమె పెద్దగా గాయపడలేదని పార్క్‌ నిర్వాహకులు తెలిపారు. డాల్ఫిన్‌ ‘సన్‌డ్యాన్స్‌’ ప్రవర్తన వింతగా ఉందని, రొటీన్‌కు భిన్నంగా అది ప్రవర్తించి ట్రైనర్‌పై దాడి చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఆ షోలో పాల్గొన్న ఒక వ్యక్తి తన మొబైల్‌లో రికార్డు చేసిన వీడియోను పెటా సంస్థ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. డాల్ఫిన్లను బంధించి వాటితో షోలు నిర్వహించడాన్ని వ్యతిరేకించింది. డాల్ఫిన్లను నిర్బంధిస్తే అవి ఎప్పటికైనా ఎదురు తిరుగుతాయని, హాని తలపెడతాయని పేర్కొంది. కాగా, ట్రైనర్‌పై డాల్ఫిన్‌ దాడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు కూడా పలురకాలుగా స్పందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles