Six killed, 13 hurt after blast at chemical factory in AP ఏలూరు పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్‌..

Six killed 13 injured in fire at pharmaceutical factory in andhra pradesh s eluru district

Amaravati, West Godavari, Eluru, Akkireddygudem, Porous Chemical facotory, Gas leak, Reactor blast, Factory explosion, six dead, AP Governor, Andhra Pradesh, crime

A blast resulted in a fire at Porus Laboratories in Andhra Pradesh’s Eluru district. Six people died while 13 others were injured and shifted to nearby hospitals. Authorities are trying to ascertain whether the reactor exploded or if the fire was caused by a short circuit.

ఏలూరు పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్‌.. ఆరుగురు మృతి

Posted: 04/14/2022 11:32 AM IST
Six killed 13 injured in fire at pharmaceutical factory in andhra pradesh s eluru district

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గతవారంలో గుజరాత్ లోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఏలూరు అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలోని నాలుగో యూనిట్‌లో జరిగిన ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కిరెడ్డిగూడెం ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమలో మంటలు అంతెత్తున్న ఎగసిపడటం.. పోగ వ్యాపించడంతో.. ఏం జరిగిందోనన్న భయాందోళనలో స్థానిక ప్రజలు పరిశ్రమ సమీపానికి చేరుకున్నారు.

పరిశ్రమవర్గాలు మాత్రం పరిశ్రమలో గత రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్ లీకైందని.. దీంతో మంటలు వ్యాపించగా పక్కనే వున్న రియాక్టర్‌ అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయని తెలిపాయి. అయితే రియాక్టర్ పేలుతున్న సమయంలో దాని పరిసర ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తున్న ఆరుగురు కార్మికులలో ఐదుగురు ఘటనాస్థలంలోనే మరణించారు. తీవ్రగాయాలపాలైన 14 మందిని చికిత్స నిమిత్తం అసుపత్రులకు తరలించారు. కాగా వీరిలో ఒక కార్మికుడు మార్గమధ్యలోనే మరణించాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పరిశ్రమలోని మిగతా కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అదే సమయంలో పరిశ్రమలో చెలరేగిన మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనలో మొత్తంగా ఆరుగురు కార్మికులు చనిపోయారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. అయితే చికిత్స పొందుతున్న కార్మికులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యవర్గాలు తెలిపాయని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 18 మంది కార్మికులు ఉన్నారని సమాచారం. ఏలూరులోని అక్కరెడ్డిగూడెం పోరస్ రసాయనాల పరిశ్రమలో ఔషధాల తయారీకి అవసరమైన పొడిని ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు.

ప్రమాద సమయంలో పరిశ్రమలో 18 మంది ఉండగా వారిలో ఇద్దరు కెమిస్టులు, 16మంది కార్మికులని వెల్లడించారు. మృతులలో ఇద్దరు స్థానికులు కాగా, మిగిలినవారు బీహార్‌కు చెందినవారని తెలిపారు. క్షతగాత్రులలోనూ ఎక్కువగా బీహారీలే ఉన్నారన్నారు. యాజమాన్యంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 13మందిని విజయవాడ ప్రభుత్వాసుప్రతికి తీసుకొచ్చారని అసుపత్రి సూపరింటెండెంట్‌ సౌభగ్యలక్ష్మి చెప్పారు. ఒక్కరి మినహా మిగిలిన కార్మికులందరూ 70 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నారని, వీరిందరి పరిస్థితి విషమంగానే వుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles