Congress leader VH's house allegedly attacked by ‘goons’ పోలీసుల అదుపులో విహెచ్ కారుపై దాడి చేసిన యువకుడు

Hyderabad police detain 18 year old student for vandalising congress leader hanumantha rao s car

VH Car Vandalised, VH attacked, Man held for pelting stones on VH house, V Hanmanth rao attacked, Congress senior leader, mirrors, ccrv cameras recorded, scenes, Senior Leader VH, smashed, V. Hanumantha Rao Car, v.hanumantha rao, Viral Video, Hyderabad, Congress, Hanumantha Rao car vandalised, VH Car Vandalised, V. Hanumantha Rao, Amberpet, Security, threatening calls, DGP, A.Revanth Reddy, Hyderabad, Telangana, Crime

An 18-year-old hotel management student was detained by Hyderabad Police for vandalising the car of senior Congress leader and former minister V Hanumantha Rao. The man, in an inebriated condition, smashed the former minister’s car, which was parked outside his Ameerpet residence. CCTV visuals show the 18-year-old man, who is a native of UP’s Bareilly, vandalising the parked car by bashing it repeatedly and even breaking the windows.

ITEMVIDEOS: సీనియర్ కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు ఇంటిపై దాడి.. పోలీసుల అదుపులో యువకుడు

Posted: 04/14/2022 01:49 PM IST
Hyderabad police detain 18 year old student for vandalising congress leader hanumantha rao s car

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వి హనుమంత రావు ఇంటిపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. గురువారం తెల్లవారుజామున అంబర్ పేటలోని తన ఇంటిపైకి ఆగంతకులు రాళ్లు రువ్వారు. తన ఇంటి ఎదుట పార్క్ చేసిన కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తన కారును ధ్వంసం చేసినవారిపై గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనకు భద్రత కల్పించాలని తాను స్వయంగా రాష్ట్ర డీజీపికి పిర్యాదు చేసినా.. భధ్రత కల్పించలేదని అన్నారు.

హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటోన్న పోలీసులు జరగరాని ఘటనలు జరిగిన తరువాత చర్యలు తీసుకోవడం కంటే.. ముందుస్తుగానే భద్రతా ఏర్పాట్లు చేస్తే.. బాగుంటుందని హితవు పలికారు. ఇవాళ ఉదయం వీహెచ్ తన కారును పరిశీలించారు. ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. హనుమంతరావుతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో సీనియర్ నేతలకే భద్రత కల్పించలేని విధంగా వ్యవస్థ తయారైందని ఆయన దుయ్యబట్టారు. తక్షణం వీహెచ్ కారును ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

హనుమంతరావుకు పోలీసు భద్రత కల్పించాలని డిమాండ్‌ రేవంత్ డిమాండ్ చేశారు. ఇక పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీహెచ్ కారు ధ్వంసం చేసిన ఘటనలో ఓ 18 ఏళ్ల హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అమీర్‌పేట నివాసం బయట పార్క్ చేసిన వీ హన్మంతరావు కారును ధ్వంసం చేసిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వీహెచ్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించిన పోలీసులు సదరు యువకుడినే నిందితుడిగా పేర్కోంటూ అదుపులోకి తీసుకున్నారు.

యూపీలోని బరేలీకి చెందిన 18 ఏళ్ల యువకుడు ఆగి ఉన్న కారును పదే పదే కొట్టి, కిటికీలు పగలగొట్టి ధ్వంసం చేసినట్లు సీసీటీవీ విజువల్స్ చూపిస్తున్నాయి. నిందితుడు వీహెచ్ పొరుగునే గత ఆరు నెలలుగా అతని స్నేహితులతో కలసి ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో కారును ధ్వంసం చేశాడు. అయితే వీహెచ్ కారును ధ్వంసం చేయాడానికి గల కారణాలను పోలీసులు విచారణలో తేలనున్నాయి. కాగా, ఈ ఘటనకు భద్రతా లోపమే కారణమని వీహెచ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా పనిచేసిన తనకే రక్షణ లేకుండా పోయిందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles