Venus, Mars, Jupiter, Saturn can be seen with naked eyes గగనంలో కనువింధు.. ఒకే రేఖలో గురు, శుక్ర, శని, అంగారక గ్రహాలు

Venus mars jupiter saturn can be seen with naked eyes this april

blazing in the east, rare event in the eastern sky, four planets in the same line, April rare event, rare event before sun-rise, mars and saturn in the east, jupiter, venus, saturn, mars in same line, Northern Hemisphere, Venus Mars Jupiter Saturn in same line, 4 planets seen with naked eyes, Venus, Mars, Jupiter, Saturn, naked eyes, April 2022, nothern hemisphere, eastern sky, sunrise, rare event, paradise of planets

Venus blazing in the east before sunrise; Mars and Saturn, also in the east before sunrise; Jupiter, emerging in the east before sunrise in early April and easier to see as the month progresses. Mercury will return to the evening sky by mid-April, to begin its best evening apparition for the year for the Northern Hemisphere.

గగనంలో కనువింధు.. ఒకే రేఖలో గురు, శుక్ర, శని, అంగారక గ్రహాలు

Posted: 04/13/2022 07:17 PM IST
Venus mars jupiter saturn can be seen with naked eyes this april

నక్షత్ర మండలం.. ఎన్నో అద్భుతాలకు, వింతలకు, వీక్షణలకు వేదిక అని తెలిసిందే. ఈ ఖగోళంలో అరుదైన నక్షత్ర కూటములు సంభవిస్తుంటాయి. అయితే ఈ ఏప్రిల్ మాసంలో అరుదైన నక్షత్ర కూటములను వీక్షించే అవకాశం మనకు లభించనుంది. సాధారణ రోజుల్లో తలపైకెత్తి చూస్తే శుక్రుడు (వీనస్), అంగారకుడు (కుజుడు) (మార్స్) కనిపిస్తుంటారు. అయితే ఈ నెలలో మాత్రం ఈ రెండింటి పక్కనే సమాంతర రేఖలో మరో రెండు గ్రహాలు దర్శనమివ్వబోతున్నాయి.

కుజ, శ్రుక్ర గహాలకు సమాంతర రేఖలో గురు (బృహస్పతి) (జూపిటర్), శనిగ్రహం (శాటర్న్). దీంతో అరుదైన గ్రహ చతుష్టయం ఆకాశంలో దర్శనమివ్వనుంది. 2016లో ఒక పర్యాయం ఇలాంటి కూటమి ఏర్పడిన తరువాత రెండేళ్ల క్రితం 2020లోనూ ఇదే తరహాలో నక్షత్రాల కూటములు కనిపించాయి. కాగా 2020 తర్వాత ఇలా కనిపించడం ఇదే తొలిసారి. 2020లో ఇవి మానవ కంటికి నేరుగా కనిపించాయి. అచ్చంగా అలాగే ఇప్పుడు మరో పర్యాయం కూడా మన కంటికి నేరుగా దర్శనం ఇవ్వనున్నాయి.

ఏప్రిల్ మధ్య నాటికి శుక్రుడు, అంగారకుడు సరసన బృహస్పతి వచ్చి చేరనుంది. ఏప్రిల్ చివరికి ఈ మూడింటి వరుసలోకి శని రానున్నాడు. జెట్ ప్రపోల్షన్ ల్యాబొరేటరీ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఇవి మన కంటికి చూడ్డానికి దగ్గరకు వచ్చినట్టు అనిపించినా. అంత దగ్గరగా ఉండవు. బిలియన్ల కిలోమీటర్ల దూరం వీటి మధ్య ఉంటుంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో వీటి అలైన్ మెంట్ లో వచ్చే మార్పులతో ఇలాంటి విశేషాలు ఏర్పడుతుంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venus  Mars  Jupiter  Saturn  naked eyes  April 2022  nothern hemisphere  eastern sky  sunrise  rare event  paradise of planets  

Other Articles