Shanghai Disneyland closes as virus rises, Shenzhen reopens చైనాలో తెరుచుకున్న కార్యాలయాలు.. డస్నీల్యాండ్ మూసివేత.

Shanghai disneyland closes as covid cases rise shenzhen business centre reopens after week

COVID-19, Omicron, COVID-19 pandemic in china, COVID-19 pandemic in Changchun, COVID-19 pandemic in Shenzhen city, SARS-CoV-2 Omicron variant, Omicron, shanghai disneyland, shanghai, disneyland, covid cases, shenzhen business centre, shenzhen, disney co., SARS-CoV-2, COVID-19 pandemic in Chinas Shenzhen city, COVID-19 pandemic in Jilin city, COVID-19 pandemic in China Jilin city, omicron symptoms, symptoms of omicron, Symptoms of omicron virus, Omicron symptoms, Omicron corona variant, Omicron B.1.1.529, covid newvariant, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, covid news, corona updates

Shanghai Disneyland closed Monday as China's most populous city tried to contain its biggest coronavirus flareup in two years, while the southern business centre of Shenzhen allowed shops and offices to reopen after a weeklong closure.

చైనాలో తెరుచుకున్న కార్యాలయాలు.. షాంఘై డిస్నీల్యాండ్ మూసివేత..

Posted: 03/21/2022 12:24 PM IST
Shanghai disneyland closes as covid cases rise shenzhen business centre reopens after week

ప్రపంచదేశాలను గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి చైనాలోని పలు నగరాల్లో మరోసారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కొత్త వేరియంట్‌ కారణంగా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదు కావడంతో అప్రమత్తమైన అధికారులు.. పలు నగరాల్లో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే దాదాపుగా వారంరోజుల తరువాత ఇవాళ లాక్ డౌన్ ఎత్తివేశారు. వ్యాపారకేంద్రమైన షెన్‌జెన్‌ నగరంలో లాక్ డౌన్ ఎత్తివేసిన అధికారులు.. పౌరులకు కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. కాగా, అత్యధిక జనాబా కలిగిన షాంఘై నగరంలో మాత్రం అంక్షలను కొనసాగిస్తున్నారు.

ముఖ్యంగా ఈ నగరంలోని డిస్నిల్యాండ్ ను మూసివేసిన అధికారులు.. ఈ నగరంలో లాక్ డౌన్ విధంచకుండానే.. పౌరులకు మాత్రం అత్యవసర పరిస్థితుల్లోనే ఇళ్ల నుంచి బయటకు రావాలన్న అంక్షలను గత వారమే విధించారు. అయితే ఆ ఆంక్షలను ఈ వారం కూడా కొనసాగిస్తున్నారు. హంకాంగ్‌ సరిహద్దు ప్రాంతంలోని షెన్‌జెన్‌ నగరంలో 1 కోటి 75 లక్షల మంది జనాభా ఉండటంతో అధికారుల్లో టెన్షన్‌ నెలకొంది. దీంతో వారిని ఇళ్లకే పరిమితం చేస్తూ అధికారులు మరో వారం పాటు అదేశాలను అమల్లో కొనసాగిస్తున్నారు. చాంగ్‌చున్‌, జిలిన్ న‌గ‌రాల్లో మ‌రోసారి సామూహిక వైర‌స్ టెస్టింగ్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

జిలిన్‌లో 20 ల‌క్ష‌ల జ‌నాభా ఉంది. ఆ న‌గ‌రంలో ప్ర‌స్తుతం క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. స్టే ఎట్ హోమ్ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఇత‌ర దేశాల‌తో పోలిస్తే, చైనాలో క‌రోనా పాజిటివ్ కేసులు త‌క్కువ‌గానే ఉన్నా.. ఆ దేశం మాత్రం జీరో టాల‌రెన్స్ విధానాన్ని అవ‌లంభిస్తోంది. ఆదివారం రోజున చైనాలో కొత్త‌గా 2027 కేసులు న‌మోదు అయ్యాయి. దాంట్లో జిలిన్ ప్రావిన్స్‌లోనే 1542 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. షాంఘైలో బ‌స్సు స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశారు. విజిట‌ర్స్ ఎవ‌రు వ‌చ్చినా వైర‌స్ నెగ‌టివ్ ప‌రీక్ష చేయాల్సి ఉంటుంది. షాంఘై డిస్నీల్యాండ్‌, డిస్నీటౌన్‌, విషింగ్ స్టార్ పార్క్‌ల‌ను మూసివేస్తున్న‌ట్లు డిస్నీ కంపెనీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles