మంచి ఆకలి మీదున్న వ్యక్తికి కంచంలో పంచభక్ష పరమాన్నాలు కనిపిస్త్తుండగా.. కళ్తు మూసుకుని భక్తిగా ప్రార్థన చేయాలంటే చేస్తారా.? ససేమిరా అంటాడు. అదే పరిస్థితి ఈ చిరుతకు వచ్చింది. వేటాడాల్సిన అవసరం లేకుండా వెతకబోయిన తీగ మోకాలోడ్డినట్టు తన కళ్ల ముందు ఓ జింక పిల్ల హాయిగా గడ్డి మేస్తోంది. ఇది చూసిన చిరుత దానిని వేటాడి తినాలని భావించింది. కానీ.. తనకు ఆహారం లభించలేదు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే చిరుత.. స్పోర్ట్స్ కారంత స్పీడ్‌గా పరుగెడుతుంది. కానీ, కళ్లముందు ఓ జింక ఉన్నా వేటాడలేకపోయింది.
జింకను చూస్తూ ఉండిపోయింది. మరి దానికి ఒంట్లో బాగాలేదా అంటే అదీ కాదు.. చాలా యాక్టివ్గానే ఉంది. కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి ఆ రెండింటికీ మధ్య పెద్ద కంచె ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విటర్లో పెట్టాడు. ఈ వీడియోలో జింక గడ్డిమేస్తూ ఉంటుంది. అవతలివైపు ఆకలితో ఉన్న చిరుత.. జింకను చూస్తూ ఉంటుంది. జింకను అందుకోవాలని చిరుత ప్రయత్నాలు చేస్తోంది. కానీ అన్ని విఫలమయ్యాయి.
కళ్లముందు ఆహారం కనిపించినా.. కడుపు నింపుకోలేని దుస్థితి, దురావస్థకు చేరుకున్న చిరుతను చూసిన నెట్ జనులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అయితే అమాయకంగా వుండాల్సిన జింక పిల్ల.. చిరుతను చూసిన తరువాత కూడా ఏ మాత్రం భయపడకుండా.. అక్కడే నిల్చుని హాయిగా గడ్డిమేస్తోంది. దీంతో జింక పిల్ల ధైర్యాన్ని కూడా నెటిజనులు ప్రశంసిస్తున్నారు. ఇది కదరా విచిత్రం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకు విండో షాపింగ్ అని సుశాంత నందా క్యాప్షన్ ఇచ్చారు. 75వేల మంది వీడియోను వీక్షించగా, 5.2వేల మంది లైక్ చేశారు. పలువురు ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు.
Window shopping by Cheetah… pic.twitter.com/x3p7PvdNS6
— Susanta Nanda IFS (@susantananda3) March 12, 2022
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more