Chhattisgarh: 3 CRPF personnel injured in Naxal firing చత్తీస్ గడ్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై మావోల దాడి..

Chhattisgarh maoists attack crpf camp in sukma three personnel injured

Maoists, Encounter, Maoist Party, Maoists, CRPF, maoist chhattisgarh attack, maoist sukma attack, maoist crpf attack, sukma crpf camp attack, maoists Kurnapalli, encounter with naxals, police personnel, sukma district, Chhattisgarh, Crime

Three CRPF personnel sustained injuries as Maoists opened fire at a CRPF camp in Chhattisgarh’s Elmagunda area in Sukma district, the Inspector General of Police at Bastar said. The Maoists used country-made weapons to attack the security camp. According to the police, the firing started on Monday morning, which was immediately retaliated by the 2nd battalion of CRPF.

చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్.. సీఆర్పీఎఫ్ క్యాంప్ పై మావోయిస్టుల దాడి..

Posted: 03/21/2022 11:31 AM IST
Chhattisgarh maoists attack crpf camp in sukma three personnel injured

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు (CRPF jawans) గాయపడ్డారు. సుక్మా జిల్లాలోని ఎల్మగుండ క్యాంప్‌పై సోమవారం ఉదయం 6 గంటల సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ చెప్పారు. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా రాయ్ పూర్ కు తరలించామని చెప్పారు.

కాగా కాల్పుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ హేమంత్‌ చౌధరి, కానిస్టేబుళ్లు బసప్ప, లలిత్‌ బాఘ్‌ గాయపడ్డారని చెప్పారు. అయితే వీరిందరి అరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వెల్లడించారు. వీరందరూ  సీఆర్‌పీఎఫ్‌ రెండో బేటాలియన్‌కు చెందిన వారని తెలిపారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఈ మధ్యే ఎల్మగుండలో క్యాంప్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశామన్నారు. మావోయిస్టులు కాల్పులు జరపడమే కాకుండా స్థానికంగా తయారైన గ్రెనేడ్లను కూడా విసిరినట్లు అక్కడ ఉన్న అధికారులు తెలిపారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి ప్రారంభంలో ఏర్పాటు చేసిన ఎల్మగుండ శిబిరం మార్చి 18న హోలీ మిలన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది, ఈ సందర్భంగా సమీపంలోని గ్రామాలకు మందులు, ఇతర వినియోగాలు పంపిణీ చేశామని, గ్రామస్తులను కూడా భద్రతా సిబ్బంది భోజనాలు ఆహ్వానించారని. దీంతో వారు ఈ దాడికి పాల్పడినట్టు తెలిపారు. కాగా రెండేళ్ల క్రితం ఎల్మగుండ నుంచి తిరిగి వస్తుండగా మావోయిస్టులు మెరుపుదాడి చేయడంతో మినపాలో 17 మంది డీఆర్‌జీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి మినప, ఎల్మగుండలో సీఆర్‌పీఎఫ్‌ శిబిరాలు మావోయిస్టులకు వ్యతిరేకంగా దూకుడుగా సాగుతున్నాయని సీనియర్‌ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles