రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇవాళ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నియామక ప్రక్రియ ఇవాళ్టి నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే హోం, విద్య, వైద్యారోగ్య శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయి. అన్ని శాఖలకు మించి హోం శాఖలో 18,334 ఉద్యోగ ఖాళీలు ఉండగా, ఆ తరువాత సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 ఉన్నాయి. వీటి తరువాతి స్థానంలో హాయ్యర్ ఎడ్యుకేషన్ 7,878 ఖాళీలతో నిలువగా.. ఆ తరువాత వైద్యారోగ్య శాఖ 12,755 ఖాళీలతో నిలిచింది. దీంతో ఆయా శాఖల్లో త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఇక అత్యల్పంగా ఎనర్జీ శాఖలో కేవలం 16 ఖాళీలు ఉన్నాయి.
శాఖల వారీగా ఖాళీల వివరాలు..
హోం శాఖ- 18,334
సెకండరీ ఎడ్యుకేషన్- 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878
బీసీల సంక్షేమం- 4,311
రెవెన్యూ శాఖ- 3,560
ఎస్సీ వెల్ఫేర్ శాఖ- 2,879
నీటిపారుదల శాఖ- 2,692
ఎస్టీ వెల్ఫేర్- 2,399
మైనారిటీస్ వెల్ఫేర్- 1,825
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221
ఆర్థిక శాఖ- 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563
న్యాయశాఖ- 386
పశుపోషణ, మత్స్య విభాగం- 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343
ఇండస్ట్రీస్, కామర్స్- 233
యూత్, టూరిజం, కల్చర్- 184
ప్లానింగ్- 136
ఫుడ్, సివిల్ సప్లయిస్- 106
లెజిస్లేచర్- 25
ఎనర్జీ- 16
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more