తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలకు ఊహలకు తగ్గట్టుగానే భారీగా కొలువుల భర్తీ ప్రకటనను స్వయంగా వెల్లడించారు. మొత్తం 91,142 ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం అని ప్రకటించారు. తమది ఎంప్లాయింట్‌మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, హయ్యెస్ట్ పెయిడ్ ఎంప్లాయిస్ తెలంగాణలో ఉన్నారని ప్రకటించుకున్న తెలంగాణ సీఎం.. కేంద్రం వైఖరి వల్లే భర్తీ ప్రక్రియ ఆలస్యమైందని ఆరోపించారు.
‘‘తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టం. నేనూ పోలీసు లాఠీ దెబ్బలు తిన్నా. అంతులేని వివక్ష, అన్యాయం ఎదుర్కొంది తెలంగాణ. వేరే పార్టీలకు రాజకీయాలంటే గేమ్.. టీఆర్‌ఎస్‌కు మాత్రం ఒక టాస్క్. ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్లం మేం. మేం ఏం చేశామో ప్రజలకూ తెలుసు. పోరాటాలు చేశాం. జైలుకు వెళ్లాం. వ్యక్తిగత నిందలు ఎదుర్కొన్నా. ఏకాగ్రత, లక్ష్యం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఊరుకున్నాం. తెలంగాణ కోసం క్షోభ, బాధ అనుభవించాం. తెలంగాణ భాష అంటే ఒకప్పుడు హాస్యాస్పదంగా ఉండేది. ఒకప్పుడు జోకర్లకు ఉండే తెలంగాణ యాస.. ఇప్పుడు హీరోలకు వచ్చేసింది. అధికారికంగా పండుగలు జరుపుకుని.. సంస్కృతిని కాపాడుకున్నాం.
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఉద్దేశంతో పోరాడాం. గోదావరి జలాలు సాధించుకున్నాం. తెలంగాణ కోసం విద్యార్థులు పోరాటాలు చేశారు. రెండు రోజులు ఆలస్యమైనా పని మంచిగా జరగాలనే కోణంలో పని చేసింది మా ప్రభుత్వం. ఇప్పటివరకు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో లక్షా 56 వేల ఉద్యోగాలకు నోటిఫై చేశాం. రాష్ట్రపతి, ప్రధానులకు స్వయంగా నేనే చర్చించా. దేశంలో ఎక్కడా లేని విధంగా.. శాశ్వతంగా 95 శాతం స్థానికులకే వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇకపై అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే. టీచర్ల ప్రమోషన్లు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాం. 9, 10 షెడ్యూల్ పంచాయితీ ఇంకా తెగని కారణంగా.. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.
* తెలంగాణలో ప్రభుత్వం గుర్తించిన ఖాళీలు: 91,142
* కాంట్రాక్ట్ ఉద్యోగుల రైగ్యులరైజేషన్: 11,103
* గ్రూప్ క్యాటగిరీ వారీగా ఖాళీలు
* గ్రూప్-1 పోస్టులు 503,
* గ్రూప్-2 పోస్టులు 582
* గ్రూప్-3 పోస్టులు 1,373
* గ్రూప్-4 పోస్టులు 9,168
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more